kanpur viral video: చోరీ చేసిన డబ్బును చూపిస్తూ దొంగల ఇన్‌స్టాగ్రామ్ రీల్.. ఆటకట్టించిన పోలీసులు
కాన్పూర్‌లోని జ్యోతిష్కుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించిన ఓ వ్యక్తి, అతని సహచరులు సంబరాల్లో మునిగిపోయారు. మంచంపై డబ్బులను పరుస్తూ.. నోట్ల కట్టలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసి పోస్ట్ చేశారు. ఈ వీడియో(kanpur viral video)ను చూసిన పోలీసులు వారికి గట్టి షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జ్యోతిష్కుడు తరుణ్ శర్మ నివాసంలో ఇటీవల దొంగలుపడి భారీగా డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశాడు. కాగా, జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో చోరీపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అయితే దొంగల ఆచూకీ గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా ఆ దొంగలు చోరీ చేసిన డబ్బును చూసి సంబరాల్లో మునిగిపోయారు. దొంగిలించిన నగదును మంచంపై పరిచి (thieves flaunting stolen money) ఇన్‌స్టాగ్...