జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..
జ్ఞానవాపి(Gyanvapi) మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI)కు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు గురువారం సమర్థించింది. సర్వేను వెంటనే పునఃప్రారంభించవచ్చని పేర్కొంది. సర్వేకు వ్యతిరేకంగా అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. "జ్ఞానవాపి మసీదు సముదాయంలో ASI సర్వే ప్రారంభించవచ్చని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తెలిపింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను హెచ్‌సి సమర్థించింది" అని జ్ఞానవాపి సర్వే కేసులో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ANIకి తెలిపారు.జూలై 27న ఏఎస్...