AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రారంభ తేదీ? కావాల్సిన పత్రాలు ఇవే
AP Free Bus Scheme | ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించే అవకాశం ఉన్నది. ఏపీఎస్ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం అమలు విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం అమలుకు సంబంధించిన అంశాలపై అధికారులు తమ నివేదికను అందజేశారు.తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తీరును అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు సౌకర్యం నిబంధనలపై ప్రభుత్వం చర్చించనుంది.అధికారిక వర్గాల ప్రకారం, APSRTC నెలకు దాదాపు 250 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఎదుర్కొంటుంది. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా. ఎంపిక చేసిన కేటగిరీ సర్వీసుల్లోనే ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులు అభిప్రాయపడుత...