Saturday, August 30Thank you for visiting

Tag: Andhra Pradesh

AP Cabinet | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్..  మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

AP Cabinet | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

Andhrapradesh
AP Cabinet | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రుల‌కు శాఖ‌లను కేటాయిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ద్ద సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌ల‌తో పాటు శాంతి భ‌ద్ర‌త‌లు త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. హోం అఫైర్స్, విప‌త్తు శాఖను వంగ‌ల‌పూడి అనిత‌కు కేటాయించారు. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు. AP Cabinet  శాఖ‌ల కేటాయింపు ఇలా..చంద్ర‌బాబు ( ముఖ్య‌మంత్రి ) – సాధార‌ణ ప‌రిపాల‌న‌, శాంతి భ‌ద్ర‌త‌లు ప‌వ‌న్ కల్యాణ్( ఉప ముఖ్య‌మంత్రి) – పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి స‌ర‌ఫ‌రా, పర్యావ‌ర‌ణ‌, అట‌వీ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ నారా లోకేశ్ – మాన‌వ వ‌న‌రులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్, ఆర్టీజీ కింజార‌పు అచ్చెన్నాయుడు – వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌, పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి, మ‌త్స్య‌శాఖ‌ అనిత వంగ...
Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Andhrapradesh
Elections 2024:  ఎనిమిది నెలల కిందట‌ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జైలుకు వెళ్లినప్పుడు 74 ఏళ్ల రాజకీయ వేత్త శ‌కం ముగిసింద‌ని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ ప‌నైపోయింద‌ని భావించారు. ఆ సమయంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోయిన‌ట్లు అనిపించింది. చంద్ర‌బాబు, ఆయన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరి త‌దిత‌రులు బాబు నిర్భందాన్ని టీడీపీకి సానుభూతి ఓట్లుగా మార్చడానికి పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. చంద్రబాబు నాయుడుకు 2024లో ఓటమిపాలైతే.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితానికి తెరప‌డిన‌ట్లేన‌నుకున్నారు. అయితే చంద్ర‌బాబు వెనుక‌డుగు వేయ‌లేదు.. మరోసారి BJPతో పొత్తు పెట్టుకుని, ఊహించ‌ని విధంగా అపూర్వ విజ‌యం సొంతం చేసుకున్నారు. సినిమాటిక్ టర్నింగ్ పాయింట్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత రాజమండ...
ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే..  ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే.. ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

Andhrapradesh, Elections
Macherla Assembly Constituency | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (Pinnelli Venkatarami Reddy) ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (EVM) ధ్వంసం చేసిన వీడియో  ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెబ్‌క్యామ్ ఫుటేజీలో, ఎమ్మెల్యే బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించడం, ఓటింగ్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని నేలపై పడవేయడం కనిపించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఈవీఎంను తొక్కుతూ దొరికిపోయారు.ఈ ఏడాది మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ వీడియో రికార్డైనట్లు సమాచారం.ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (మే 21) గుర్తించింది. దీంతో రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది.మాచర్ల (macherla) అసెంబ్లీ నియోజకవర్గం లోని పీఎస్ నంబ...
Election Notification | ఏపీ, తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ

Election Notification | ఏపీ, తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ

Telangana
Election Notification | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల‌కు అంతా సిద్ధ‌మ‌వుతోంది. మొత్తం ఏడు విడ‌త‌ల‌లో దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.  లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్ప‌టికే మూడు దశల ఎన్నికల నోటిఫికేషన్లు ఈసీ విడుదల చేసింది. ఇక ఏప్రిల్ 18న, గురువారం నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల (Election Notification) చేయ‌నుంది. నాలుగో విడత‌లో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జ‌రుగుతాయి. ఆంధ్రప్రదేశ్ (25 స్థానాలు), తెలంగాణ (17), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఉత్తర్ ప్రదేశ్ (13), బిహార్ (5), ఝార్ఖండ్ (4), ఒడిశా (4), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకాశ్మీర్ (1) లో నోటిఫికేష‌న్ రానుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గురువారం ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండ‌గా అదే రోజు నుంచి నామినేషన్ల ప్ర‌క్రియ ప్రారంభ...
TTD Board : కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, రూ.10కే భోజ‌నం.. టీటీడీ కీలక నిర్ణయాలు

TTD Board : కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, రూ.10కే భోజ‌నం.. టీటీడీ కీలక నిర్ణయాలు

Andhrapradesh
TTD Board Decisions : టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అలాగే ముఖ్య‌మంత్రి జగన్, టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి (TTD Board Meeting) సమావేశం జ‌రిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి విలేక‌రుల‌కు వివరించారు. ఇక నుంచి ప్రతి సంవ‌త్స‌రం ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు రూ.10కే భోజనం TTD Board Decisions  | గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు బంగారు పూత, అలిపిరి, గాలి గోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు అనుమ‌తించారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి తీర్మాన...
RTC Special Buses : సంక్రాతికి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంఫై సర్కారు క్లారిటీ..

RTC Special Buses : సంక్రాతికి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంఫై సర్కారు క్లారిటీ..

Andhrapradesh, Telangana
సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు.. RTC Special Buses: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వారి ప్రయాణికుల సంఖ్య  భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే పండుగ వేళ టీఎస్ఆర్టీసీ.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) ను పురస్కరించుకొని  ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 7 నుంచి జనవరి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.ఆన్ లైన్ టికెట్లు (online tickets ) బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ( RTC Special Buses ) ఉంటుందా?  అని మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.. సంక్రాంతి పండుగకి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ...
APSRTC : కార్తీక మాసంలో భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ..

APSRTC : కార్తీక మాసంలో భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ..

Trending News
ఒక్కరోజులోనే పంచారామ క్షేత్రాల దర్శనం పవిత్ర కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే పంచ మహాపాతకాలు తొలగిపోతాయని నమ్మకం. మొక్కులు నెరవేరుతాయని విశ్వాసం. ఈక్రమంలో భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ భక్తుల కోసం గుంటూరు, విజయనగరం వంటి అనేక ప్రాంతాల నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హిందువులు కార్తీక మాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. శివకేశవులను అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు, ప్రధానంగా ఈ కార్తీకమాసంలో శివ పూజకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలకు మాత్రమే కాదు అన్ని శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలు భక్తులతో కోలాహలం ఉంటుంది. తెలుగు వారు ఈ పంచారామ క్షేత్రాలను దర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ .. పంచారామ క్షేత్రాలను సులభంగా దర్శించుకునేందుకు స్పెషల్...
ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారీగా దసరా సెలవులు

ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారీగా దసరా సెలవులు

Andhrapradesh, Telangana
AP TS Dasara Holidays తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఏపీలో 11 రోజులు, తెలంగాణ లో 13 రోజులు దసరా హాలిడేస్ అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.AP TS Dasara Holidays : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. తెలంగాణలో ఈ ఏడాది 13 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబరు 26న తిరిగి స్కూళ్ల పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికాలు వెల్లడించారు.. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈనేపథ్యంలోనే పాఠశాలలు, కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రక‌టించింది. అక్టోబరులో సాధారణంగా సెలవులు ఎక్కువగా ఉంటాయి. 13 రోజులు సెలవులు తెలంగాణలో బతుకమ్మ, దసరా ( విజయదశమి) పండుగలకు సెలవులు మొత్తం 13 రోజులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్...
Pawan Kalyan : అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !

Pawan Kalyan : అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !

Andhrapradesh
 Pawan Kalyan : విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైటెన్షన్ నెలకొంది. అనుమంచిపల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను..  ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అడ్డుకునేం దుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన జనసైనికులు వాటిని తొలగించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.ఇదిలా ఉంటే.. అనుమంచిపల్లి సమీపంలో మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో తీసుకు వెళ్తున్నారు. అయితే వారిని...
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

Andhrapradesh, Crime
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్‌ చేస్తున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెక్ పోస్టు సమీపంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్‌ చేసేందుకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి వుంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే తెలుపు రంగు వేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైవే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తమ వాహనాన్ని రోడ్డు పక్కన ఉంచి పనులు చేసుకుంటున్నారు. అతివేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇదే రోడ్డుపై వస్తున్న కారు వేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాదా...