
Naegleria fowleri | మనిషి మెదడు తినే భయంకరమైన సూక్ష్మజీవి.. ముందే ఎలా కనిపెట్టాలి? ముందు జాగ్రత్తలు..
What is Naegleria fowleri | మనిషి మెదడును తినే అమీబా ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఇటీవల ఐదేళ్ల బాలిక నైగ్లేరియా ఫౌలెరీ (మెదడు తినే అమీబా) వల్ల కలిగే అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా మే 20న కేరళలోని కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. గతంలో కూడా, అరుదైన ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ అనేక మంది ప్రాణాలను బలిగొంది.
అసలు ఈ నైగ్లేరియా ఫౌలెరీ ఏమిటి?
ఇది ఒకే-కణ జీవి, సరస్సులు, వేడి నీటి కుంటలు, సరిగా నిర్వహించని స్విమ్మింగ్ పూల్ లలో నివసిస్తుంది. 115°F (46°C) వరకు అధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రొటోజొవన్ జీవి పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. ఇది వెచ్చని వాతావరణంలో స్వల్ప కాలాం పాటు జీవించగలదు. 1965లో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా దీన్ని కనుగొన్నారు. ఇది మైక్రోస్కోప్‌తో మాత్రమే మనం చూడగలం. నేగ్లేరియా, నేగ్లేరియా ఫౌలెరి అనే ఒక జాతి మాత్రమే ప్రజలకు సోకుతుంది.
మానవ సంక్రమణ - ప్రక్రియ...