పరకాల అమరధామం : తెలంగాణలో జలియన్‌వాలాబాగ్
భారత్‌లో తెలంగాణ విలీనం కాకముందు అసలేం జరిగింది?
తెలంగాణలోని పరకాలలో నిజాం పరిపాలన (hyderabad nizam) కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించిందని చరిత్రకారులు చెబుతుంటారు. నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు ఇక్కడ మారణహోమానికి తెగబడ్డారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం లభించిన తర్కాత నిజాం రాజ్యంలోనూ జాతీయ పతాకం ఎగురవేసేందుకు అనేక యత్నాలు జరిగాయి. అయితే వాటిని అణగదొక్కేందుకు రజాకార్లు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల వీరోచిత పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా పరకాల(Parakala)లోని అమరధామం నిలుస్తుంది. పరకాల ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది.
ఆ రోజు ఏం జరిగిందంటే..
భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ తెలంగాణ (Telangana) ప్రాంతానికి మాత్రం రాలేదు. ఈ ప్రాతం నిజాం, రజాకార్ల ఆధీనంలోనే ఉంది. నిజాం నిరంకుశ పాల...