vande bharat | ఆల్‌స్టోమ్ కంపెనీ రూ.30,000 కోట్ల వందే భారత్ రైళ్ల తయారీ టెండర్ రద్దు
Indian Railways | ఊహించని విధంగా భారతీయ రైల్వే తాజాగా వందేభారత్ (vande bharat ) రైల్ కోచ్ ల తయారీకి సంబంధించి ఆల్‌స్టోమ్ ఒప్పందాన్ని రద్దు చేసింది. భారతీయ రైల్వే 100 అల్యూమినియం-బాడీ వందే భారత్ రైళ్ల తయారీతోపాటు నిర్వహణ కోసం రూ. 30,000 కోట్ల టెండర్‌ను రద్దు చేసింది. ఈ టెండర్ ను ఫ్రెంచ్ రోలింగ్ స్టాక్ మేజర్ ఆల్‌స్టోమ్ (Alstom India)జూన్ 2023లో గెలుచుకుంది.సాంప్రదాయ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో పోలిస్తే తక్కువ బరువు ఎక్కువ దృఢత్వం కలిగిన అల్యూమినియం-బాడీడ్ రైలు సెట్‌లు తయారు చేయాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. భారతీయ రైల్వే తన రైళ్ల వేగం, సామర్థ్యం, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ అధునాతన రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
అయితే మొదటి అల్యూమినియం-బాడీ కలిగిన వందే భారత్ రైళ్లు స్లీపర్ కోచ్ లుగా ఉంటాయని, 2025 మొదటి త్రైమాసికం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తో...