
Airtel Recharge Plan | ఇంట్లో, ఆఫీసులో Wi-Fi ఉన్నవారికి ఎయిర్‌టెల్ నుంచి బెస్ట్ రీచార్జి ప్లాన్ రూ. 509 వివరాలు ఇవే..
Airtel Recharge Plan | భారత్ లో Jio, Airtel, Vi వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జూలై 3 నుంచి తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచారు. తాజా ఈపెంపు మొబైల్ టారిఫ్‌ను సగటున 15 శాతం పెంచింది. ఈ కారణాలతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ కు మారాలని ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ, పాత్ నెట్ వర్క్ కు అలవాటుపడిన వినియోగదారులు తమ ప్రస్తుత ఆపరేటర్‌తో నే కొనసాగాలని నిర్ణయించుకొని సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నారు.మనలో చాలా మంది ఇప్పటికీ ఇంటి నుంచి పని చేస్తున్నారు. హై-స్పీడ్ డేటా, పెరిగిన అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ కోసం Wi-Fi కనెక్షన్‌ను వినియగించుకుంటున్నారు. మీరు ఇంటి వద్ద, ఆఫీసులో వైఫై కనెక్టివిటీ కలిగిఉంటే ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లకు బదులు 84 రోజుల పాటు పొడిగించిన వ్యాలిడిటీని పొందేందుకు మీరు Airtel నుంచి రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు మీ ఇల్లు, కార్యాలయంలో Wi-Fiకి యాక్సెస...