
Israel-Iran Conflict | ఇజ్రాయిల్ పై క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్
Iran Attacks | ఇరాన్ అంతా ఊహించినట్లుగానే మూకుమ్మడి దాడులను ప్రారంభించింది. సిరియాలోని తమ కాన్సులేట్ భవనంపై దాడి ఘటన తర్వాత ప్రతీకారంతో ఊగిపోతున్న ఇరాన్ ముందుగా చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి తెగబడింది. ఇరాన్ సైన్యం సుమారు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ (Israel) పై దాడులు (attack) చేసింది. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్ధరాత్రి సమాచారం అందించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఓ బాలిక సహా అనేక మంది గాయపడినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులలో కొన్నింటిని ఇజ్రాయెల్ పేల్చివేసింది. అలాగే సిరియా, జోర్డాన్‌ల ప్రాంతాల్లో కొన్ని డ్రోన్‌లను కూల్చివేసింది.న్యూస్ అప్డేట్స్ కోసం WhatsApp చానల్ లో చేరండి..ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరు తో 200 లకుపైగా కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసిం...