మీరు కొన్న గోధుమ పిండి కల్తీదా? లేదా? అనేది ఇలా ఇంట్లోనే పరీక్షించుకోండి
How to Test Flour Purity | కల్తీకి కాదేదీ అనర్హం.. ప్రస్తుతం మార్కెట్ లో అక్రమార్కులు ధనార్జనే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రతీ వస్తువును కల్తీ చేసేస్తున్నారు. వంట నూనెలు, పాలు, నెయ్యి, తేనె, పప్పులు ఎన్నో ఉన్నాయి. ఇందులో గోధుమ పిండి మినహాయింపు కాదు. కల్తీ పిండి (Adulterated Wheat Flour) వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.గోధుమ పిండి, గోధుమ ధాన్యం నుంచి తయారవుతుంది, గోదుప పిండి సాధారణంగా లేత గోధుమరంగు లేదా తెలుపు రంగులో ఉంటుంది. మెషిన్ ద్వారా గ్రౌండ్ చేసిన పిండి చాలా మెత్తగా ఉంటుంది. పొట్టును కలిగి ఉండదు. అయితే దంచిన గోదుమ పిండి ముతకగా ఉంటుంది, కొంత పొట్టును కలిగి ఉంటుంది. అలాగే ఇది వగరు వాసన కలిగి ఉంటుంది.
గోధుమ పిండిని కల్తీ చేయడానికి ఏ పదార్థాలను ఉపయోగిస్తారు?
కల్తీల యొక్క అత్యంత సాధారణ రకాలు:మైదా లేదా శుద్ధి చేసిన పిండి (Maid...