Thursday, February 13Thank you for visiting

Tag: ADR Report

లోక్‌సభ ఎన్నికల్లో  121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు

లోక్‌సభ ఎన్నికల్లో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు

Elections
2024 Lok Sabha Election | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 121 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులని ప్రకటించుకోగా, 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారని ఏడీఆర్ నివేదికలు (ADR Election Data) వెల్ల‌డిస్తున్నాయి. ఇంకా 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చ‌దివిన‌ట్లు డేటా సూచిస్తోంది. దాదాపు 1,303 మంది అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారని, 1,502 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించారు. ఇదే విశ్లేషణ ప్రకారం డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మొదటి దశలో.. 26 మంది నిరక్షరాస్యులు.. మొదటి దశ ఎన్నికలలో, 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ నుంచి 12వ తరగతుల మధ్య ఉన్నారని నివేదిం...
Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Elections
Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది 'కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్ర‌కారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవ‌లం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు. 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు లోక్‌సభ ఎన్నికల మూడో విడత (Third Phase Voting ) లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటిం...
ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..

ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..

National
ADR Report  | న్యూఢిల్లీ: 17వ లోక్‌సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందగా , వాటిలో 45 బిల్లులు సభలో ప్రవేశపెట్టిన రోజునే ఆమోదం పొందాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ఏడీఆర్ ) విశ్లేషణలో వెల్లడైంది. లోక్‌సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అత్యధికంగా 410 ప్రశ్నలు అడిగారు. అప్నా దళ్ (సోనీలాల్)కు చెందిన ఇద్దరు ఎంపీలు కనీసం ఐదు అడిగారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధ‌వారంప్రచురించిన నివేదికలో పేర్కొంది. శివసేన 354 ప్రశ్నలతో, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం 284, తెలుగుదేశం పార్టీ (TDP) 247, ఎంకే స్టాలిన్ డీఎంకే 243 ప్రశ్నలు సంధించింది.ఇదిలా ఉంటే, అత్యల్ప సగటు ఉన్న పార్టీలలో అప్నా దళ్ (సోనీలాల్) ఐదు ప్రశ్నలు, అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఏడు, ఆప్ 27, నేషనల్ కాన్ఫరెన్స్ 29, ఎల్‌జెపి 34 ప్రశ్నలు సంధించారు.  సగటున బీజేపీ ఎంపీలు 14...
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..