Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్
Nitish Kumar NDA Meeting | న్యూఢిల్లీ: ఎన్డీఏ (NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును (PM Modi) రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) , చంద్రబాబు సహా, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు నరేంద్ర మోదీని బలపరిచారు. ఈ సందర్భంగా నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిజెపి నేతృత్వంలోని ఎన్‌డీఏ.. కొత్తగా ఎన్నికైన ఎంపిల సమావేశం దిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా నితిష్ కుమార్ మాట్లాడుతూ.. ఇండియా కూటమికి పొరపాటున ఎక్కువ సీట్లు వచ్చాయని, ఈ బృందం "ఏ పని చేయలేదని పేర్కొన్నారు. "నేను అన్ని వేళలా ప్రధానమంత్రితో ఉంటాను" అని కూడా ప్రకటించారు. నితీష్ కుమార్ మోడీకి మద్దతు ప్రకటించడం.. ఒకవైపు ఇండి కూటమి ఆశలకు గండిపడినట్లైంది.లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇద్దరు కింగ్‌మేకర్లు అవతరించారు. JDU నుండి 12 మంది. చంద్రబాబు నాయుడు TDP నుంచి 16 మంది ఎంపీల మద్దతుతో ఎన్ డీఏ ప్రభుత్వాన్ని ...