Gruha Jyothi Scheme | గృహ జ్యోతి పథకం కోసం కొత్త నిబంధనలు.. అర్హతలు ఇవే..
Gruha Jyothi Scheme | అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (200 Units Of Free Current) పొందేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అన్నింటిలో మొదటిది.. తెల్ల రేషన్ కార్డులు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంతే కాకుండా తెలంగాణ విద్యుత్ శాఖ ద్వారా కరెంట్ మీటర్ నంబర్ తో ఆధార్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. మరో నిబంధన.. లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించాల్సి ఉంటుంది.గృహ జ్యోతి పథకం ఒక్క మీటర్ ఉన్న గృహాలకు మాత్రమే వర్తిస్తుంది.
అద్దెదారులు, అద్దె వసతి గృహాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే..
మీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే ఈ పథకం వర్తించదని గమనించండి.
కరెంటు బిల్లు బకాయిలు ఉన్నవారు లేదా గత రెండు నెలలుగా కరెంటు బిల్లు చెల్లించనివారు ఈ పథకానికి ...