Home » Special trains | గుడ్ న్యూస్‌.. ఈ రూట్ల‌లో ప్ర‌యాణికుల కోసం ప్రత్యేక రైళ్లు

Special trains | గుడ్ న్యూస్‌.. ఈ రూట్ల‌లో ప్ర‌యాణికుల కోసం ప్రత్యేక రైళ్లు

Special trains

Special trains | ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా భార‌తీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించాల‌ని నిర్ణయించింది. ఈమేర‌కు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ వివ‌రాలు వెల్ల‌డించారు. నాలుగు ప్ర‌త్యేక‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అవి సనత్‌నగర్-సంత్రగచ్చి-సనత్‌నగర్ (07069/07070), ఎస్ఎంవీ బెంగళూరు – సంత్రాగచ్చి – ఎస్ఎంవీ బెంగళూరు (06211/06212) నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

1 సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్

సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07069) రైలు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు న‌డుస్తుంది. ఈ రైలు స‌న‌త్ న‌గ‌ర్ లో బుధవారాల‌లో ఉదయం 6:20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 8:55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 8:57 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం రాత్రి 10:03 గంటలకు, అక్కడ నుండి రాత్రి 10:08 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డుకు రాత్రి 11:10 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి రాత్రి 11:12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సంత్రాగచ్చి స్టేష‌న్ కు చేరుకుంటుంది.

2. సంత్రాగచ్చి – సనత్‌నగర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

సంత్రాగచ్చి – సనత్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (07070) ప్ర‌త్యేక‌ రైలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ప్ర‌తీ గురువారాల్లో ఈ రైలు సాయంత్రం 5:25 గంటలకు సంత్రాగ‌చ్చి నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుని,‌ అక్కడ నుండి ఉదయం 6:47 గంటలకు బయలుదేరి విజయనగరం ఉదయం 7:48 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుండి ఉదయం 7:50 గంటలకు బయలుదేరి దువ్వాడ ఉదయం 9:25 గంటలకు చేరుకుని, అక్కడి నుండి ఉదయం 9:27 గంటలకు బయలుదేరి శుక్రవారం రాత్రి 11:50 గంటలకు సనత్‌నగర్ స్టేష‌న్‌కు చేరుకుంటుంది.

READ MORE  vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..

ఈ రెండు రైళ్ల హాల్టింగ్‌స్టేషన్లు..

సనత్‌నగర్ నుండి సంత్రాగచి మధ్య సికింద్రాబాద్, చర్ల‌పల్లి, ఘట్‌కేసర్, నల్ల‌గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అంకపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, బ్రహ్మాపూర్ రోడ్ స్టేష‌న్ల‌తోపాటు సికింద్రాబాద్, బ్రహ్మాపూర్ రోడ్, సి. జాజ్‌పూర్ కె రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రెండు రైళ్ల‌లో కోచ్ లు

  • సెకెండ్ ఏసీ క్లాస్ కోచ్-2,
  • థర్డ్ ఏసీ క్లాస్ కోచ్-6,
  • స్లీపర్ క్లాస్ కోచ్‌లు -7,
  • జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-3,
  • సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్-1,‌
  • జనరేటర్ మోటార్ కార్-1
READ MORE  Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

3. ఎస్ఎంవీ బెంగళూరు-సంత్రాగచ్చి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

ఎస్ఎంవీ బెంగళూరు-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ (06211) రైలు అక్టోబర్ 26న ఉదయం 10.15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 3:53 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడి నుంచి 3:55 గంటలకు బయలుదేరుతుంది. కొత్తవలస 4:38 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి 4:40 గంటలకు స్టార్ట్ అవుతుంది.విజయనగరం 5:30 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి 5:40 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం రోడ్‌లో ఉదయం 6:43 గంటలకు చేరుకుంటుంది. అక్కడి‌ నుంచి 6:45 గంటలకు బయలుదేరి,‌ మరుసటి రోజు ఆదివారం రాత్రి 7:45 గంటలకు సంత్రాగచ్చి స్టేష‌న్ కు చేరుకుంటుంది.

సంత్రాగచ్చి-ఎస్ఎంవీ బెంగుళూరు స్పెషల్ (06212) రైలు

సంత్రాగచ్చి-ఎస్ఎంవీ బెంగుళూరు స్పెషల్ (06212) రైలు అక్టోబర్ 27 ఆదివారం రాత్రి 11:30 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. మ‌ళ్లీ అక్కడి నుంచి 12:07 గంటలకు బయలుదేరి విజయనగరం 1:05 గంటలకు చేరుకుని అక్క‌డి నుంచి కొత్తవలస 1.45 గంటలకు చేరుకుంటుంది. మ‌ళ్లీ అక్కడి నుండి బయలుదేరి దువ్వాడ మధ్యాహ్నం 3.10 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుండి 3.15 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు చేరుకుంటుంది.

READ MORE  charlapalli railway terminal | పూర్తి కావొచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. జంటనగరాల్లో నాలుగో అతిపెద్ద రైల్వేస్టేషన్

హాల్టింగ్ స్టేష‌న్స్‌

ఈ రైళ్లు కృష్ణరాజపురం, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, కటక్, బాలాసోర్ రైల్వే స్టేషన్లలో నిలుస్తాయి.

Special trains కోచ్ ల వివ‌రాలు..

  • థర్డ్ ఏసీ క్లాస్ కోచ్-2,
  • స్లీపర్ క్లాస్ కోచ్‌లు -3
  • జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-12
  • సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్-1
  • జనరేటర్ మోటార్ కార్-01 కోచ్

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్