Friday, August 29Thank you for visiting

Special Stories

Special stories and Exclusive stories

Parle-G story: 12 మంది కార్మికులతో మొదలై…  రూ.8000కోట్ల విక్రయాలతో ప్రపంచంలోనే టాప్ గా నిలిచిన బిస్కెట్ బ్రాండ్..

Parle-G story: 12 మంది కార్మికులతో మొదలై… రూ.8000కోట్ల విక్రయాలతో ప్రపంచంలోనే టాప్ గా నిలిచిన బిస్కెట్ బ్రాండ్..

Special Stories
Parle-G Story : కేవలం బిస్కెట్ మాత్రమే కాదు.. ఇది మనతో శాశ్వతమైన అనుబంధం ఏర్పరుచుకున్న చిన్ననాటి జ్ఞాపకాల రుచి. ఉదయం సాయంత్రం వేళల్లో టీ లేదా పాలతో  చక్కని కాంబినేషన్, నోటిలో వేసుకోగానే కమ్మనైన టేస్ట్ ఇస్తూ కరిగిపోతుంది. ఐకానిక్ పసుపు రంగు ప్యాకెట్‌పై ముద్దులొలికే చిన్న పాప ఫొటో.. ఇవన్నీ జ్ఞాపకాల వస్త్రంపై అందమైన అల్లికలుగా మిగిలిపోయాయి. 12 మంది కార్మికులతో మొదలై ఇప్పడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే బిస్కెట్ బ్రాండ్ గా నిలిచింది. Parle-G ఎంతగా ప్రసిద్ధి చెందిందంటే, మహమ్మారి కాలంలో కూడా, పెద్ద పెద్ద కంపెనీల వ్యాపారాలు మందగించినా కూడా, Parle-G కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కట్ గా పార్లే-G అవతరించింది. అయితే ప్యాకెట్ పై చిన్నారి ఫొటో అందరి మనసుల్లో ముంద్రపడిపోయింది. ఈ పాప ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి చిన్ననాటి ఫొటోగా అందరూ భ...
సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసా..

సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసా..

Special Stories
పురాతన కాలం నుంచి హనుమాన్ చాలీసా హిందూ సంస్కృతిలో ఓ భాగమైంది. ఆంజనేయస్వామిని ఆరాధించే వారు ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణం చేస్తారు. హనుమాన్ చాలీసా 40 శ్లోకాలను కలిగి ఉంటుంది. అయితే భక్తుడు కేవలం ఒక్క సెంటీమీటర్ ఉన్న పుస్తకంలో హనుమాన్ చాలీసా రాశాడు. హరియాణాలోని హిస్సార్ కు చెందిన జితేంద్ర పాల్ సింగ్ ఒక సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసాను రాశాడు.జితేంద్రపాల్ సింగ్ అత్యంత సూక్ష్మమైన 15 పేజీల పుస్తకాన్ని రూపొందించారు. ప్రతీ పేజీ ఒక సెంటీమీటర్ పొడవు, అర సెంటీమీటర్ వెడల్పు ఉంటుంది. అంతేకాదు ఈ పుస్తకం కవర్ పేజీపై పర్వతాన్ని ఎత్తుకొని వెళ్తున్న హనుమంతుడి చిత్రపటాన్ని కూడా చిత్రీకరించాడు. ఈ పుస్తకాన్ని దెబ్బతినకుండా రక్షించడానికి లామినేట్ కూడా చేశాడు.ఈ హనుమాన్ చాలీసా మినియేచర్ వెర్షన్ రాయడానికి తనకు 15 రోజులు పట్టిందని జితేంద్ర పాల్ సింగ్ వివరించారు. ఈ పుస్తకాన్ని ప్రజలు ఎక్కడికైనా సు...
National Mango Day 2023: మామిడి పండ్ల ప్రాముఖ్యత, ఆసక్తికరమైన విషయాలు తెలుసా?

National Mango Day 2023: మామిడి పండ్ల ప్రాముఖ్యత, ఆసక్తికరమైన విషయాలు తెలుసా?

Special Stories
National Mango Day 2023: మామిడి పండును 'ఫలాలకు రారాజు (King of Fruits) అని పిలుస్తారు. ఇది మన హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. చూడగానే నోరూరించే రుచికరమైన ఈ  ఫలానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి వివరిచడానికి, అలాగే ప్రజల్లో అవగాహన పెంచడానికి ఏటా జూలై 22న జాతీయ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున, జాతీయ మామిడి దినోత్సవం గురించిన థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత, కొన్ని ఆకర్షణీయమైన వాస్తవాలను పరిశీలిద్దాం.. జాతీయ మామిడి దినోత్సవం 2023 చరిత్ర మామిడి పండ్ల చరిత్ర వేల సంవత్సరాల నాటిది. మామిడి పండ్లను మొదట 5,000 సంవత్సరాల క్రితం పండించారని, అప్పటి నుండి భారతీయ జానపద కథలతో ముడిపడి ఉందని నమ్ముతారు. పురాణాల ప్రకారం బుద్ధ భగవానుడికి మామిడి తోట ఉండేదని, అక్కడ ఆయన మామిడి చెట్టు నీడలో విశ్రాంతి పొందేవారని చెబుతారు. ఇంగ్లీష్, స్పానిష్ మాట్లాడే దేశాలలో ఈ పండును 'మ్యాంగో 'గా పిలుస్తారు. ఈ పేర...
మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?

మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?

National, Special Stories
మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ఎరండోల్ ప్రాంతంలోని పాండవ్ వాడా స్థలాలు ఇస్లామిక్ ఆక్రమణలకు గురవుతున్నాయి. పాండవులు ఎరండోల్ ప్రాంతంలో అజ్ఞాతవాసంలో గడిపారని, ఇక్కడ నిర్మించిన హిందూ, జైన దేవాలయాల నిర్మాణాలు 800-1000 సంవత్సరాల నాటివని నమ్ముతారు. తరువాత హిందువులలో తీవ్రమైన ఉదాసీనత కారణంగా, 125 సంవత్సరాల క్రితం ముస్లింలు పాండవ్ వాడను నెమ్మదిగా ఆక్రమించడం ప్రారంభించారు. వారు వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ చివరికి అక్కడ మసీదును నిర్మించారు.హిందూ జనజాగృతి సమితి (HJS), పాండవ్వాడ సంఘర్ష్ సమితి వంటి హిందూ సమూహాలు పాండవ్వాడను వక్ఫ్ బోర్డు నుండి తిరిగి పొందాలని. ఆ ప్రాంతాలను పునరుద్ధరించాలని పోరాడుతున్నాయి. వివాదాస్పద మసీదు ప్రస్తుతం 100 సంవత్సరాల ఉనికికి సంబంధించిన రికార్డులను కలిగి ఉంది. అయితే పాండవ వాడలోని ప్రధాన భవనాలు (జైన్, హిందూ దేవాలయాల శైల...
ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం

ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం

National, Special Stories
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎరండోల్‌(Erandol)లోని జుమ్మా మసీదును గత జూలై 14న శుక్రవారం మూసివేశారు. మూడు రోజుల క్రితం, జల్గావ్ జిల్లా(Jalgaon district) కలెక్టర్ అమన్ మిట్టల్ మసీదులోకి ప్రవేశాన్నినిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మసీదును పరిశీలిస్తే అచ్చం పురాత హిందూ దేవాలయంగా కనిపిస్తుంది. మొఘలులు హిందూ దేవాలయాలను ద్వంసం చేసి మసీదులుగా మార్చివేశారనేందానికి ఇది ఒక చిహ్నంగా నిలుస్తుంది.అయితే ఈ మసీదు ఆలయాన్ని తలపిస్తున్నదని ఇది ఎప్పటి నుంచో జైన, హిందూసంఘాల ఆధీనంలో ఉందని, నిర్మాణంపై ఉన్న "ముస్లింల ఆక్రమణలను" తొలగించాలని పేర్కొంటూ స్థానిక హిందూ సంఘాలు, పాండవ్వాడ సంఘర్ష్ సమితి ఆరు నెలల క్రితం కలెక్టర్‌ను ఆశ్రయించాయి. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన అక్కడి కలెక్టర్ తాజాగా నిషేధం విధించారు. కాగా ఈ మసీదు 13వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాను అల్లావుద్...
ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..

ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..

Special Stories
మూతపడిపోతున్న Cafe Coffee day సంస్థను నిలబెట్టింది.వీజీ సిద్దార్థ భార్య మాళవిక హెగ్డే విజయగాథ..అది 2019 సంవత్సరం.. భారతదేశంలోని 23 ఏళ్ల చరిత్ర కలిగిన కాఫీ చైన్, కేఫ్ కాఫీ డే (CCD) చాలా కష్టాల్లో ఉంది. వ్యాపారం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాలు తీర్చలేక దాని వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ గందరగోళం మధ్య, ఆయన భార్య మాళవిక హెగ్డే (Malavika Hegde) సంస్థను రక్షించడానికి ముందుకొచ్చింది. కాఫీ పరిశ్రమలో ఎటువంటి వృత్తిపరమైన అనుభవం లేదు. కానీ Cafe Coffee Day కి పూర్వ వైభవం తీసుకురావాలని నిశ్చయించుకుంది.ఎ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ ప్రముఖ భారతీయ కాఫీ చైన్ అయిన కేఫ్ కాఫీ డే (CCD), దాని యజమాని VG సిద్ధార్థ 2019లో ఆత్మహత్యతో మరణించడంతో పతనం అంచున ఉంది.సిద్ధార్థ CCDని జాతీయ సంస్థగా అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు.. CCD కేవలం కాఫీ షాప్ కంటే ఎక్కువ.. ఇది ప్రజలు క...
పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!

పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!

Special Stories
మీ ఇంటి పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయా? సర్పాల నుండి మీ ఇంటిని సురక్షితంగా ఉంచే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.. వీటి సాయంతో పాములను మీ ఇంటి నుండి దూరంగా ఉంచుకోవచ్చు!పాములు తడిగా ఉండే, దట్టమైన పొదలు, రాళ్ల కుప్పలతో ఉన్న ఏకాంత ప్రదేశాలను ఇష్టపడతాయి. మీకు తెలియకుండానే ఇంటి పరిసరాల్లో సులభంగా నివాసాలను ఏర్పరచుకోవచ్చు.  పాములను ఇంటి పరిసరాలకు రాకుండా ఉంచేందుకు సులభమైన మార్గాలలో Natural Snake Repellent Plants పెంచడం ఒకటి. అంటే మీ ఇంటి చుట్టూ పాములు ఇష్టపడని పాము-వికర్షక మొక్కలను పెంచాలి. పాములు ఇష్టపడని ఘాటైన వాసనతో కూడిన మొక్కలు ఈ జాబితాలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. Natural Snake Repellent Plants (పాము వికర్షక మొక్కలు) 1. వెస్ట్ ఇండియన్ లెమన్‌గ్రాస్ (West Indian Lemongrass)బొటానికల్ నేమ్: సైంబోపోగాన్ సిట్రాటస్.. ఈ మొక్క సిట్రస్ మొక్కల సమూహానికి చెందినది మరియు బలమైన ...
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..

Special Stories
భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు  ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి. 10. బ్లాక్ మాంబా Black Mambaబ్లాక్ మాంబా ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది ప్...