Saturday, August 30Thank you for visiting

Special Stories

Special stories and Exclusive stories

Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు

Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు

Special Stories
Vande Bharat sleeper | దేశంలో రాత్రిపూట సుదూర రైలు ప్రయాణం చేసేవారికి మరింత అత్యాధునిక సౌకర్యవంతమైన అనుభవం అందించేందుకు త్వ‌ర‌లో వందేభార‌త్ స్లీప‌ర్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్లు అందుబాటులో రానున్నాయి. ఇటీవ‌ల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న బెంగళూరులోని BEML ఫెసిలిటీలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే.. వందే భారత్ స్లీపర్ టికెట్ ధర రాజధాని ధరలతో సమానంగా ఉంటుందని ఈసంద‌ర్భంగా వైష్ణవ్ తెలిపారు. "వందే భారత్ స్లీపర్ టికెట్లు మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా రాజధాని ఎక్స్ ప్రెస్ తోస‌మానంగా ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒక ప్రీమియం, ఫుల్‌ ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీస్, ఇది న్యూదిల్లీని భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులతో కలుపుతుంది.వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత మూడు నెలల్లో ప్యాసింజర్ కార్యకలాపాలు ప్రారంభమవుత...
Ovitrap Baskets | ఓవిట్రాప్ బాస్కెట్స్ అంటే ఏమిటి? ఇవి డెంగ్యూ దోమలను ఎలా నియంత్రిస్తాయి.?

Ovitrap Baskets | ఓవిట్రాప్ బాస్కెట్స్ అంటే ఏమిటి? ఇవి డెంగ్యూ దోమలను ఎలా నియంత్రిస్తాయి.?

Special Stories
Ovitrap Baskets  | కర్ణాటకలో దాదాపు 24,028 డెంగ్యూ కేసులు (dengue) న‌మోదు కాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవ‌ల ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అదే దోమలను ఆకర్షించే ఓవిట్రాప్ బాస్కెట్స్‌.. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోపాలపురలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వీటిని ప్రారంభించారు."పర్యవేక్షణ కోసం ఉపయోగించే ఓవిట్రాప్స్, ఏడెస్ దోమల జనాభాను గుర్తించగలవు, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తాయి. ఈ బుట్టలను ఇళ్లకు 20 అడుగుల దూరంలో అమర్చారు. లోపల స్ప్రే చేసిన రసాయనం దోమలను ఆకర్షిస్తుంది, వాటిని బుట్టలోకి రప్పిస్తుంది. ఈ వినూత్న ప్రయోగం డెంగ్యూ దోమల నివారణకు మరింత దోహదపడుతుందని ఎక్స్‌లో దినేష్ గుండూరావు అన్నారు.Our @DHFWKA health department has initiated a new pilot pr...
Independence Day 2024 | జాతీయ జెండాను సరిగ్గా ఎగురవేయడం ఎలా? చేయవలసినవి చేయకూడనివి తప్పకుండా తెలుసుకోండి..

Independence Day 2024 | జాతీయ జెండాను సరిగ్గా ఎగురవేయడం ఎలా? చేయవలసినవి చేయకూడనివి తప్పకుండా తెలుసుకోండి..

Special Stories
Independence Day 2024 | యావ‌త్‌ భారతదేశం 78వ స్వాతంత్ర్య  దినోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపునేందుకు సిద్ధ‌మైంది. ఈ సంవత్సరం వేడుకల థీమ్-విక‌సిత్ భారత్‌. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దేశం ల‌క్ష్యాన్ని గుర్తుచేస్తుంది. స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, క‌ళాశాల‌లు, ప్ర‌భుత్వ‌, ప్ర‌వేట్‌ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో కుల‌మ‌తాల‌కు అతీతంగా అంద‌రూ జాతీయ జెండాను ఎగుర‌వేస్తారు. భార‌తావ‌నికి స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించిన స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులను గ‌ర్తుచేసుకుని వారికి ఘ‌నంగా నివాళుల‌ర్పిస్తారు.మ‌న జాతీయ జెండా ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతీయ త్రివర్ణ పతాకం మూడు సమాంతర చారలను కలిగి ఉంటుంది: పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ, మధ్యలో నీలిరంగులో అశోక చక్రం ఉంటుంది.ప్రతి రంగు, చిహ్నం ముఖ్యమైన విలువలను సూచిస్తుంది: కాషాయ రంగు ధైర్యానికి...
Independence Day 2024 | జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధాన మంత్రి ఎవరు? వివరాలు

Independence Day 2024 | జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధాన మంత్రి ఎవరు? వివరాలు

Special Stories
Independence Day 2024 | భారతదేశపు అతిపెద్ద జాతీయ పండుగ - స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోంది. ప‌ల్లెల నుంచి మ‌హా నగరాల వరకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సంఘాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జ‌లంద‌రూ ఆగస్ట్ 15 న జరగబోయే స్వ‌తంత్ర దినోత్స‌వ సన్నాహాల్లో మునిగిపోయారు. దేశభక్తితో దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం మొద‌లైంది. తెల్ల‌దొర‌ల నుంచి దేశాన్ని ర‌క్షించేందుకు స్వాతంత్ర్య  దినోత్సవం సమరయోధులు, నాయకులు చేసిన అమూల్య‌మైన‌ త్యాగాలను గుర్తుచేసుకునే సమయం ఇది.దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగ, 'తిరంగ యాత్ర' వంటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంతో అంత‌టా సందడిగా మారింది. జూలై 28న తన నెలవారీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసారంలో, ప్ర‌ధాని మోదీ హర్ ఘర్ తిరంగా అభియాన్ గురించి మాట్లాడారు. harghart...
Railway News | పర్వతాల మధ్య రైలు కూతలు..  ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు కనెక్టివిటీ త్వరలో ప్రారంభం..

Railway News | పర్వతాల మధ్య రైలు కూతలు.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు కనెక్టివిటీ త్వరలో ప్రారంభం..

Special Stories
Udhampur-Srinagar-Baramulla Rail | అత్యంత సుంద‌ర‌మైన క‌శ్మీర్ ప్రాంతంలో మొట్ట‌మొద‌టిసారి రైలు కూత‌లు వినిపించ‌నున్నాయి. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకోవడంతో కాశ్మీర్ లోయ ప్ర‌యాణికుల సుదీర్ఘ‌మైన చిర‌కాల స్వ‌ప్నం నెర‌వేరే క్ష‌ణాలు ఆస‌న్న‌మ‌వుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 3694 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు దాదాపు సిద్ధంగా ఉందని తెలిపారు.ఇటీవ‌ల విలేకరుల సమావేశంలో కేంద్ర‌ మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ దాదాపు పూర్తవుతుందని, కత్రా - రియాసి మధ్య 17 కిలోమీటర్ల T-1 సొరంగం విభాగం మాత్రమే పెండింగ్‌లో ఉందని తె...
Kanwar Yatra Rules | కన్వర్ యాత్ర.. యూపీ ప్రభుత్వం తెచ్చిన ఆదేశాలు ఏమిటి? ఈ నిబంధనలు ఎందుకు?

Kanwar Yatra Rules | కన్వర్ యాత్ర.. యూపీ ప్రభుత్వం తెచ్చిన ఆదేశాలు ఏమిటి? ఈ నిబంధనలు ఎందుకు?

Special Stories
Kanwar Yatra Rules 2024 | ఎంతో భక్తిశ్రద్ధలతో శివభక్తులు నిర్వహించే  'కన్వర్ యాత్ర'కు అంతా సిద్ధమైంది. జూలై 22 నుంచి ఆగస్టు 2వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ  క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..  శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'కన్వర్ యాత్ర' మార్గాల్లో ఉన్న అన్ని తినుబండారాల షాపుల‌కు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ అన్ని టీ స్టాళ్లు, ధాబాలు, తోపుడు బండ్లకు కూడా వర్తించ‌నుంది. అయితే కన్వర్ యాత్రికుల పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్ర‌క‌టించారు. పవిత్రమైన శ్రావణ మాసంలో లక్షలాది మంది శివ భక్తులు తమ స్థానిక దేవాలయాలలో సమర్పించడానికి ప‌విత్ర‌ గంగాజలాన్ని సేకరించేందుకు కుండలను మోసుకుంటూ కాలినడకన నడుస్తారు. ఈ స‌మయంలో వారు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కు దూరంగా ఉంటారు. అలాగే ఆహారంలో ఉల్లిపా...
Zika virus | దేశంలో జికా వైరస్ కేసుల కలకలం.. ఈ మహమ్మారికి ఇలా చెక్ పెట్టండి

Zika virus | దేశంలో జికా వైరస్ కేసుల కలకలం.. ఈ మహమ్మారికి ఇలా చెక్ పెట్టండి

National, Special Stories
Zika virus | వ‌ర్షాకాలం మొద‌లు కాగానే దోమ‌లు విజృంభిస్తున్నాయి. డెంగీ, మ‌లేరియా వంటి విష‌జ్వ‌రాలు వ్యాపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జికా వైర‌స్ కేసులు భార‌త్ లో న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వైర‌స్‌ కేసులు మహారాష్ట్రలో ఎక్కువ‌గా న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీల‌క సూచ‌న‌లు జారీ చేసింది. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విష‌జ్వ‌రాల‌పై నిరంతర నిఘా ఉంచాల‌ని చెప్పింది. గర్భిణీ స్త్రీలపై దృష్టి పెట్టాల‌ని, జికా వైరస్ సోకిన గర్భిణుల పిండం ఎదుగుదలను నిశితంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. జికా వైరస్ అంటే ఏమిటి? 1947లో ఉగాండాలో మొట్టమొదట జికా వైరస్ ను కనుగొన్నారు.  ఏడెస్ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.  ఈ ప్రాణాంతక వైరస్ పేరు ఉగాండాలోని జియాకా అడవి నుంచి వచ్చింది. ఇక్కడే దీన్ని గుర్తించారు. ఇది చికున్‌గున్యా,...
Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

Special Stories
Nalanda New Campus | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం ఉదయం నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, 17 దేశాల రాయబారులు పాల్గొన్నారు. నూతన క్యాంపస్ ను ప్రారంభించిన అనంతరం మొక్కను నాటారు. ప్రధాని మోదీ . పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను కూడా పరిశీలించారు.అంతకుముందు X లో PM Modi తన అభిప్రాయాలను పంచుకున్నారు.  "ఇది మన విద్యా రంగానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు, రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభమవుతుంది. నలందకు ఈ అద్భుతమైన భాగంతో బలమైన అనుబంధం ఉంది. కొత్త క్యాంపస్ లో ఏమున్నాయి? క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్‌లుగా విభజించబడింది.  ఒక్కో బ్లాక్ లో 40 తరగతి గదులు ఉన్నాయి. మొత్తం సీటింగ్ కెపాసిటీ సుమారు 1900. ఇందులో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. ఒక్కొక్కటి 300 మంది సీటింగ్ కెపాసి...
Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..

Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..

Special Stories
Nalanda University | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న న‌లంద యూనివ‌ర్సిటీలో కొత్త క్యాంప‌స్‌ను ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ (PM Modi) ఆవిష్క‌రించారు. అంత‌కు ముందు ప్ర‌ధాని మోదీ .. యునెస్కో వార‌స‌త్వ క‌ట్ట‌డమైన‌ న‌లంద మ‌హావీర‌ను సంద‌ర్శించారు.నలంద విశ్వ‌విద్యాలయానికి సంబంధించిన‌ పురాతన శిథిలాలకు 20 కి.మీ కంటే తక్కువ దూరంలోనే ఈ కొత్త క్యాంప‌స్‌ ఉంది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. ఈ పురాతన విశ్వ‌విద్యాల‌యాన్ని 427 CEలో కుమారగుప్త చక్రవర్తి స్థాపించాడు. ఎనిమిది శతాబ్దాలకుపైగా నలంద విజ్ఞాన దీవిగా వర్ధిల్లింది. ఎంతో అనుభ‌వ‌జ్ఞ‌లైన వేద‌పండితులు ఇక్క‌డ బోధించేవారు. చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి సుదూర ప్రాంతాల నుండి 2,000 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది విద్యార్థులతో అద్భుతమైన ఈ విద్...
kavach | కవచ్ అంటే ఏమిటి? రైళ్లు ఢీకొనకుండా ఎలా పనిచేస్తుంది?

kavach | కవచ్ అంటే ఏమిటి? రైళ్లు ఢీకొనకుండా ఎలా పనిచేస్తుంది?

Special Stories
kavach technology | ఒకే లైన్‌లో ఒకే సమయంలో రెండు రైళ్లు ప్రయాణిస్తే ఒక‌దానికొక‌టి ఢీకొన‌కుండా ఉండేందుకు పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థనే ఈ కవాచ్.. అయితే ఈరోజు ప‌శ్చిమ బెంగ‌ల్ డార్జిలింగ్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ట్రాక్‌లపై ఈ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ అందుబాటులో లేదు. కోల్‌కతాకు వెళ్లే కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనడంతో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే గ‌తంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కవాచ్ సిస్టమ్‌ గురించి వివరిస్తున్న పాత వీడియో ఒక‌టి వైరల్ అవుతోంది. ఈ వ్యవస్థను ఇంకా చాలా రైలు నెట్‌వర్క్‌లో ఇన్‌స్టాల్ చేయలేదని అధికారులు తెలిపారు.వచ్చే ఏడాది నాటికి 6,000 కి.మీ ట్రాక్‌లను కవర్ చేయాలనే లక్ష్యంతో ఢిల్లీ-గౌహతి మార్గంలో భద్రతా వ్యవస్థను అమలు చేయాలని భార‌తీయ‌ రైల్వే యోచిస్తోంది. బెంగాల్ ఈ ఏడాది కవ...