Telangana

South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్.. సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..

Spread the love

South Central Railway Updates | హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా సెప్టెంబర్‌ 1నుంచి 30 వరకు సికింద్రాబాద్‌-వరంగల్‌ మెమూ 07462) రైలు రద్దు చేశారు. అలాగే వరంగల్‌-హైదరాబాద్‌ మెము రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035) రైళ్లు రద్దయయ్యాయి.

ఇక సెప్టెంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్‌ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్‌-కరీంనగర్‌ ఎంఈఎంయూ (07766), కరీంనగర్‌-బోధన్‌ ఎంఈఎంయూ(Karimnagar-Bodhan MEMU)(07894), నవంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు బోధన్‌-కరీంనగర్‌ మెము (07893), కరీంనగర్‌-సిర్పూర్‌ టౌన్‌ (07765) రద్దు అయ్యాయి. అలాగే  నవంబర్‌1నుంచి 30 వరకు కాచిగూడ-నడికుడి(07791), నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చేసినట్టు  రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌1నుంచి 30వరకు హెచ్‌ఎస్. నాందేడ్‌-రాయిచూర్‌(17664) రైలును తాండూర్‌-రాయచూర్‌ల మధ్య, సెప్టెంబర్‌2 నుంచి అక్టోబర్‌ 1వరకు రాయిచూర్‌-పర్భని (17663) ఎక్స్ ప్రెస్ రైలును, రాయిచూర్‌-తాండూర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.


న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *