Friday, March 14Thank you for visiting

సింగిల్ చార్జిపై 212కి.మి రేంజ్, గంటకు 105కి.మి స్పీడ్

Spread the love

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..

Simple One Electric Scooter: విద్యుత్ వాహన ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు 21నెలల నిరీక్షణ తర్వాత విడుదలైంది. బెంగళూరులకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ (Simple Energy)..  మంగళవారం అధికారికంగా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ప్రారంభ ధరతో విడుదల చేసింది. 750W ఛార్జర్‌తో కూడిన మోడల్ రూ. 1.58 లక్షల ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ లాంచ్ సందర్భంగా ప్రకటించింది.

జూన్ 6 నుంచి డెలివరీలు

2021, ఆగస్ట్ 15న రూ.1.10 లక్షల ధరతో కంపెనీ ఈ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ధరను అమాంతం పెంచేసింది. అయితే వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు జూన్ 6 నుంచి బెంగళూరు కేంద్రంగా దశలవారీగా ప్రారంభమవుతాయని సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుహాస్ రాజ్‌కుమార్ ప్రకటించారు. సింపుల్ ఎనర్జీ ఇప్పటికే రూ. 110 కోట్లతో శూలగిరిలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.  Simple One EV Launched

READ MORE  ఏథర్ వాహదారులకు గుడ్ న్యూస్.. "ఏథర్ సర్వీస్ కార్నివాల్" ప్రారంభించింది....

2021 నుంచి ఇప్పటివరకు సుమారు 1 లక్ష ప్రీ-బుకింగ్‌లను పొందింది. గతంలో ప్రకటించిన వాహన ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 35,000 పెరిగినప్పటికీ కస్టమర్ల నుంచి ఎలాంటి  అభ్యంతరాలు రావని తాము భావిస్తున్నట్లు రాజ్‌కుమార్ చెప్పారు.

ఒక్కసారి చార్జ్ చేస్తే 212కి.మి వెళ్లొచ్చు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Simple One Electric Scooter) ను ఒక్కసారి చార్జ్ చేస్తే.. 212కి.మి వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది దేశీయ విపణిలో అత్యంత ఎక్కువ రేంజ్ ఇచ్చే   ఎలక్ట్రిక్ టూ-వీలర్‌గా నిలిచింది. ఈ స్కూటర్ లో నాన్ రిమువబుల్, రిమూవబుల్ (పోర్టబుల్) బ్యాటరీలను అమర్చారు. మరోవైపు గంటకు 105 కి.మి వేగంతో ఈ స్కూటర్ దూసుకెళ్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వచ్చిన మొదటి ఇ-స్కూటర్ అవుతుంది. IIT-ఇండోర్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమిళనాడులోని శూలగిరిలో సంవత్సరానికి దాదాపు 5 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో తన కొత్త తయారీ కేంద్రాన్ని కంపెనీ ప్రారంభించింది.

READ MORE  Tesla Cybercab | టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ.. స్టీరింగ్, పెడల్స్ లేని రోబోటాక్సీ..

 

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?