7 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తిలో చిక్కుకున్న సూది.. AIIMS వైద్యులు అయస్కాంతాన్ని ఉపయోగించి..
ఢిల్లీలోని AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడారు. బాలుడి ఊపిరితిత్తులలో సూది చిక్కుకుపోగా వైద్యులు అయస్కాంతాన్ని ఉపయోగించి విజయవంతంగా తొలగించారు.
బాలుడి ఎడమ ఊపిరితిత్తులో సూది ఉందని తెలియడంతో బుధవారం ఎయిమ్స్‌లో చేర్చారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూది ఊపిరితిత్తుల్లోకి ఎలా చేరిందో బాలుడు కానీ, కుటుంబసభ్యులు కానీ చెప్పలేదు. అతనికి తీవ్ర జ్వరం, దగ్గు రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతన్ని ఎయిమ్స్ AIIMS కు రిఫర్ చేశారు.
ఊపిరితిత్తుల్లో సూది చాలా లోతుగా ఉన్నట్లు ఎక్స్‌రేలో తేలిందని పీడియాట్రిక్ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ విశేష్ జైన్ తెలిపారు. “సాధారణంగా మేము బ్రోంకోస్కోపీ ద్వారా బయటి వస్తువులను తొలగిస్తాము. ఇక్కడ సవాలు ఏమిటంటే, సూది ఊపిరితిత్తులలో చాలా లోపలికి వెళ్లిపోయింది. దీంతో వైద్య పరికరాలను ఉపయోగించడానికి పరిమితమైన అవకాశాలు ఉన్నాయి. జైన్” అని చెప్పారు., “మేము అప్పుడు అయస్కాంతాన్ని ఉపయోగించాలనే ఆలోచనతో ప్రయత్నాలు చేశాము. అది విజయవంతమైంది. ఈ అయస్కాంతం లేకుంటే లేదా ఊపిరితిత్తులలో సూది కనిపించకపోతే, “బాలుడికి ఓపెన్-హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చేది” అని తెలిపారు.
బాలుడు క్షేమంగా కోలుకున్న తర్వాత డిశ్చార్జి చేసినట్లు అధికారులు తెలిపారు.
AIIMS వైద్యుల అరుదైన ఆపరేషన్..
సూది ఊపిరితిత్తులలో చాలా లోతుగా పడి ఉంది. సాంప్రదాయ పద్ధతుల్లో వెలికితీయం అసాధ్యమైందని గుర్తించారు. సూదిని సురక్షితంగా తీయడానికి వినూత్న పరిష్కారాలను అన్వేషించే లక్ష్యంతో ప్రయ్నతించారు. అయస్కాంతాన్ని శ్వాసనాళంలోకి దింపే ప్రమాదం లేకుండా సూది ఉన్న ప్రదేశానికి తరలించడమే ప్రాథమిక లక్ష్యం అని వైద్యులు తెలిపారు. బృందం చాకచక్యంగా ఒక ప్రత్యేక పరికరాన్ని రూపొందించింది. దానికి దారం, రబ్బరు బ్యాండ్‌ని ఉపయోగించి అయస్కాంతాన్ని సురక్షితంగా అతికించారు.
ఎడమ ఊపిరితిత్తులో సూది స్థానాన్ని గుర్తించేందుకు బృందం శ్వాసనాళం ఎండోస్కోపీ చేసింది. ఎండోస్కోపీ ఆధారంగా “మాగ్నెట్-టిప్డ్ పరికరం జాగ్రత్తగా చొప్పించారు. సూది అయస్కాంత శక్తికి ప్రతిస్పందించడంతో అద్భుతం జరిగింది. దాని దాగి ఉన్న ప్రదేశం నుండి సజావుగా కదులుతూ వచ్చింది. చివరకు విజయవంతంగా బయటకు తీయగలిగారు. ”అని డాక్టర్ జైన్ చెప్పారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.