
Self Help Groups RTC Buses | రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండల మహిళా సమాఖ్యలకు మొత్తం 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి జీవోను సైతం మంగళవారం విడుదల చేసింది. ఒక్కో బస్సు విలువ రూ.36 లక్షలు. ఒక్కో మండల సమఖ్య, ఒక్కో బస్సును కొనుగోలు చేసి ఆర్టీసికి అద్దె ఇవ్వనుంది.
నెలకు అద్దె రూపంలో మండల సమఖ్య(Self Help Groups) కు టిజి ఆర్టీసీ (TGSRTC) రూ. 77, 220 చెల్లించనుంది. మొత్తం 150 అద్దె బస్సులను ఆర్టీసికి మండల సమఖ్యలు అప్పగించనున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఆయా డిపోలకు ఆయా బస్సులను వినయోగించనున్నారు.
మొదటి విడతలో ఈ జిల్లాలకు
కాగా మొదటి విడతలో ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల మహిళా సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న 150 మండల సమఖ్యలను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా మహిళా సమాఖ్యలకు కేటాయించిన బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర మంత్రులు ప్రారంభించానున్నారు.
Self Help Groups : మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ
మరోవైపు బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాల (Telangana Self Help Groups)కు తెలంగాణ సర్కారు బ్యాంకు గ్యారంటీ సైతం ఇవ్వనుంది. దీంతో దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను నడిపించనున్నారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు మహిళా శిశు సంక్షేమశాఖమంత్రి సీతక్క(Seethakka), రవాణా, బిసి సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar ) తదితరులు పాల్గొని అద్దె బస్సులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనుంది ప్రభుత్వం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.