Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ స్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు..

Trains Cancelled  | ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ స్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు..

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ డివిజన్‌ లో ట్రాక్‌ మెయింటెనెన్స్‌ పనుల కోసం ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోనూ రైల్వే మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో నెలరోజులుపాటు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ నెలరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

రద్దయిన రైళ్ల జాబితా..

  • Trains Cancelled From Kachiguda ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గుంతకల్-బీదర్ (07671) మధ్య నడుస్తున్న రైలును రద్దు చేశారు.
  •  ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబరు 1వ తేదీ వరకు బోధన్ నుంచి కాచిగూడ మధ్య నడుస్తున్న (07275) రైలును కూడా రద్దు చేశారు.
  • ఆగస్టు 2-సెప్టెంబర్ 1 కాచిగూడ-గుంతకల్ (07670)
  • ఆగస్టు 1-31 కాచిగూడ-రాయచూర్ (17693)
  • ఆగస్టు 1-31 రాయచూర్-గద్వాల్ (07495)
  • ఆగస్టు1-31 గద్వాల్-రాయచూర్ (07496)
  • ఆగస్టు 1-31 రాయచూర్-కాచిగూడ (17694).
  • ఆగస్టు 1-31 కాచిగూడ-నిజామాబాద్ (07596)
  • ఆగస్టు 1-31 నిజామాబాద్-కాచిగూడ (07593)
  • ఆగస్టు 1-31 మేడ్చల్-లింగంపల్లి (47222)
  • ఆగస్టు 1-31 లింగంపల్లి-మేడ్చల్ (47225)
  • ఆగస్టు 1-31 మేడ్చల్-సికింద్రాబాద్ (47235)
  • ఆగస్టు 1-31 సికింద్రాబాద్-మేడ్చల్ (47236)
  • ఆగస్టు 1-31 మేడ్చల్-సికింద్రాబాద్ (47237)
  • ఆగస్టు 1-31 సికింద్రాబాద్-మేడ్చల్ (47238)
  • ఆగస్టు 1-31 మేడ్చల్-సికింద్రాబాద్ (47242)
  • ఆగస్టు 1-31 సికింద్రాబాద్-మేడ్చల్ (47245)
READ MORE  Modernization of ITI's | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..

ఆగస్ట్ 5 నుంచి 10 వరకు ఈ రైళ్లు ర‌ద్దు..

  • విజయవాడ – భద్రాచలం రోడ్ (07979), భద్రాచలం రోడ్ – విజయవాడ (07278),
  • డోర్నకల్ – విజయవాడ (07755), విజయవాడ – డోర్నకల్ (07756),
  • విజయవాడ – సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్ – విజయవాడ (12714) శాతవాహన ఎక్స్ ప్రెస్, గుంటూరు – సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్ – గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ రద్దయ్యాయి.
  • పుణె – సికింద్రాబాద్ శతాబ్ది ఎక్ర్ ప్రెస్ (12205) రైలు ఈ నెల 29, 31, ఆగస్ట్ 1వ తేదీల్లో రద్దు చేశారు. అలాగే సికింద్రాబాద్ – పుణె శతాబ్ది ఎక్స్ ప్రెస్ (12206) రైలు ఈ నెల 29, 31వ తేదీల్లో రద్ద‌యింది.
READ MORE  Special trains : సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌ మధ్య అన్ రిజ‌ర్వ్‌డ్ కోచ్ ల‌తో 24 ప్రత్యేక రైళ్లు..

ఈ నెల 30న సికింద్రాబాద్ – ముంబయి ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ (12220)
ఈ నెల 31న ముంబయి – సికింద్రాబాద్ ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ (12219) రద్దయ్యాయి.
అలాగే, నిజామాబాద్ – పుణె (11410) ఈ నెల 31న రద్దైంది.

దారి మళ్లింపు..

  • హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ (18046)
  • సికింద్రాబాద్ – విశాఖ మధ్య తిరిగే గోదావరి,
  • సికింద్రాబాద్ – తిరుపతి మధ్య తిరిగే పద్మావతి,
  • సికింద్రాబాద్ – గూడూరు మధ్య తిరిగే సింహపురి,
  • ఆదిలాబాద్ – తిరుపతి మధ్య రాకపోకలు సాగించే కృష్ణా ఎక్ర్ ప్రెస్‌లతో పాటు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.
READ MORE  Train Tickets Booking | రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ట్రెయిన్‌ టికెట్ల బుకింగ్‌లో కొత్త నిబంధనలు

కాచిగూడ-హిసార్ ప్రత్యేక రైళ్ల పొడిగింపు..

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) కాచిగూడ-హిసార్-కాచిగూడ ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు  ప్రకటించింది. రైలు నెం 07055 (కాచిగూడ-హిసార్), గతంలో జూలై 25 వరకు నడపాల్సి ఉంది. తాజాగా ఇప్పుడు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు పొడిగించనుంది. ఈ రైలు ప్రతి గురువారం నడుస్తుంది. అలాగే ప్రతి ఆదివారం నడిచే రైలు నెం 07056 (హిసార్-కాచిగూడ), గతంలో జూలై 28 వరకు నడపాల్సి ఉంది. ఇప్పుడు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించనున్నారు.


 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *