Sam Pitroda Quits Congress : జాత్యహంకార వ్యాఖ్యలతో దుమారం.. కాంగ్రెస్ కు శామ్ పిట్రోడా రాజీనామా
Sam Pitroda Quits Congress | లోక్ సభ ఎన్నికల సమయంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ప్రముఖ కాంగ్రెస్ సభ్యుడు, పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా ఈ సాయంత్రం పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యాఖ్యలను జాత్యహంకారమని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలు, ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలోనే శ్యామ్ పిట్రోడా గురించి పార్టీ కమ్యూనికేషన్స్-ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ X లో ఒక కీలకమైన పోస్ట్ చేశారు.
” శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయన నిర్ణయాన్ని అంగీకరించారు” అని పోస్ట్‌లో ఉంది. కాగా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పిట్రోడా భారతదేశాన్ని విభిన్న దేశంగా అభివర్ణించారు, ఇక్కడ తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు, పశ్చిమాన ప్రజలు అరబ్‌లా కనిపిస్తారు, ఉత్తరాన ఉన్నవారు శ్వేతజాతీయులుగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రిన్ల మాదిరిగా కనిపిస్తారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈనేపథ్యంలోనే జాత్యహంకార వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. కాగా కొద్దిరోజుల క్రితం వారసత్వ పన్నుపై పిట్రోడా చేసిన వ్యాఖ్యపై ఇప్పటికీ నిప్పులు చెరుగుతూనే ఉంది. అయితే శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంది. “భారతదేశ వైవిధ్యాన్ని వివరించడానికి శ్రీ సామ్ పిట్రోడా చెప్పిన సారూప్యతలు అత్యంత దురదృష్టకరం.. అవి ఆమోదయోగ్యం కాదు. ” అని పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
श्री सैम पित्रोदा ने अपनी मर्ज़ी से इंडियन ओवरसीज कांग्रेस के अध्यक्ष पद से इस्तीफ़ा देने का फ़ैसला किया है। कांग्रेस अध्यक्ष ने उनका इस्तीफ़ा स्वीकार कर लिया है।
Mr. Sam Pitroda has decided to step down as Chairman of the Indian Overseas Congress of his own accord. The Congress…
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 8, 2024