RTC Special Buses : సంక్రాతికి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంఫై సర్కారు క్లారిటీ..
సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు..
RTC Special Buses: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వారి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే పండుగ వేళ టీఎస్ఆర్టీసీ.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) ను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 7 నుంచి జనవరి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
ఆన్ లైన్ టికెట్లు (online tickets ) బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ( RTC Special Buses ) ఉంటుందా? అని మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.. సంక్రాంతి పండుగకి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సులకు సంబంధించి శుక్ర వారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఆర్టీసీ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష సమావేశం నిర్వహించారు..
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ ఉండే మార్గాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తామని సజ్జనార్ తెలిపారు.. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అయన పేర్కొన్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్, అరాంఘర్, ఎల్బీ నగర్, కేపీహెచ్ బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్ స్టాపుల వద్ద తాగునీరు, కుర్చీలు, మొబైల్ టాయిలెట్స్, టెంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ బస్ స్టాప్ ల వద్ద ఇద్దరు డీవీఎం స్థాయి అధికారులను నియమించనున్నారు.. వీరు ప్రత్యేక బస్సుల గురించి ప్రయాణికులకు సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. బస్ టికెట్ల ధరలు పెంచబోమని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు టీ ఎస్ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..