Friday, March 14Thank you for visiting

మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా

Spread the love

బీహార్ లోని ఒక రెస్టారెంట్ కు రూ. 140 విలువైన స్పెషల్ మసాలా దోస అర్డర్ వచ్చింది. అయితే దోసతోపాటు సాంబార్ సర్వ్ చేయని కారణంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ కు రూ. 3,500 చెల్లించాల్సి వచ్చింది.

బీహార్ లోని బక్సర్ లోని ఒక రెస్టారెంట్ లో దోసతో సాంబార్ లేకుండా వడ్డించారు. దానికి బదులుగా సూప్ ను సర్వ్ చేశారు. ఈ స్పెషల్ మసాలా దోస ధర రూ. 140 వసూలు చేశారు. అయితే రెస్టారెంట్ ఇప్పుడు పెనాల్టీగా రూ.3,500 చెల్లించాల్సి వచ్చింది. సాంబార్ చట్నీ దోసెలతో వడ్డించడం ఒక విధమైన ఆచారం. ఒక కస్టమర్ దానిని కోర్టుకు లాగడంతో రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా విధించారు. పిటిషనర్ కు దోసతో సాంబార్ వడ్డించకపోవడం వల్ల కస్టమర్ “మానసికంగా, శారీరకంగా ఆర్థికంగా” నష్టపోయాడని వినియోగదారుల కోర్టు పేర్కొంది.
జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్ కు 45 రోజుల గడువు ఇచ్చింది. రెస్టారెంట్ జరిమానా చెల్లించకుంటే జరిమానా మొత్తంపై 8 శాతం వడ్డీ వసూలు చేయబడుతుందని తెలిపింది. .

READ MORE  Hindu population : 1950 నుంచి 2015 వ‌ర‌కు భారత్ లో భారీగా త‌గ్గిన హిందువుల జ‌నాభా..

అయితే ఈ సంఘటన ఆగస్టు 15, 2022 నాటిది. న్యాయవాది మనీష్ గుప్తా తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మసాలా దోసె వేయాలని నిర్ణయించుకుని బక్సర్ లోని నమక్ రెస్టారెంట్ కి చేరుకున్నాడు. రూ.140 విలువైన ప్రత్యేక మసాలా దోసె ప్యాక్ వచ్చింది.

అయితే, సాధారణంగా దోసెతో వడ్డించే సాంబార్ మిస్సయిందని గుర్తించి సాంబార్ గురించి ఆరా తీసేందుకు రెస్టారెంట్ కు చేరుకున్నాడు. రెస్టారెంట్ యజమాని అతని ప్రశ్నకు సరిగ్గా స్పందించలేదు. అంతటితో ఆగకుండా “రూ.140కి మొత్తం రెస్టారెంట్ కొనాలనుకుంటున్నారా?”. హేలనగా మాట్లాడడంతో కస్టమర్ మనీష్ కు చిర్రెత్తుకపోయింది.
వెంటనే అతడు రెస్టారెంట్ కు లీగల్ నోటీసును పంపించాడు. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. 11 నెలల తర్వాత, వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ వేద్ ప్రకాష్ సింగ్ , సభ్యుడు వరుణ్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ రెస్టారెంట్ ఓనర్ ను దోషిగా నిర్ధారించి, రూ. 3,500 జరిమానా విధించింది.

READ MORE  రోడ్డు భద్రతపై అవగాహన కోసం కూతురు పెళ్లిలో హెల్మెట్‌లు పంపిణీ చేసిన తండ్రి

“మానసిక, శారీరక బాధలు”
పిటిషనర్ మనీష్ గుప్తా మానసిక, శారీరక, ఆర్థిక” బాధలను డివిజన్ బెంచ్ గుర్తించింది. రెస్టారెంట్ పై రూ. 3,500 జరిమానా విధించించింది.. ఈ జరిమానాలో వ్యాజ్యం ఖర్చు రూ.1,500 కాగా, ప్రాథమిక జరిమానా రూ. 2,000. సకాలంలో చెల్లించకపోతే జరిమానా మొత్తంపై రెస్టారెంట్ 8 శాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?