Posted in

Puri Rathyatra | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేక రైలు సేవలు

Puri Rathyatra
Spread the love

Puri Rathyatra | పూరీ జ‌గ‌న్నాథ‌స్వామి రథయాత్ర ఉత్సవాలను పుర‌స్క‌రించుకొని వేలాది మంది భక్తులు పూరీకి చేరుకోవడానికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) గోండియా (మహారాష్ట్ర), ఖుర్దా రోడ్ (ఒడిశా) మధ్య ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించింది. జగన్నాథుని దర్శనానికి వెళ్లే యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ కొత్త రైలు అందుబాటులోకి తీసుకురావ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. . ఈ ప్రత్యేక రైలు జూన్ 26, జూలై 7, 2025 మధ్య రెండు దిశలలో ఐదుసార్లు నడుస్తుంది.

ప్రత్యేక రైలు ముఖ్య వివరాలు:

రైలు నంబర్ 08893 – గోండియా నుండి ఖుర్దా రోడ్
ఈ ప్రత్యేక రథయాత్ర రైలు జూన్ 26, 28, 30, జూలై 2, 5 తేదీలలో మధ్యాహ్నం 1:30 గంటలకు గోండియా నుండి బయలుదేరుతుంది.

హాల్టింగ్ స్టేష‌న్స్‌ టైమింగ్స్

  • డోంగర్‌గఢ్ (సాయంత్రం 14:30 గంటలు)
  • రాజ్‌నంద్‌గావ్ (సాయంత్రం 15:00 గంటలు)
  • దుర్గ్ (15:58 గంటలు)
  • రాయ్‌పూర్ (సం.రాత్రి 5:05 గంటలు)
  • మందిర్ హసౌద్ (సాయంత్రం 18:55 గంటలు)
  • ఇది మరుసటి రోజు ఉదయం 08:45 గంటలకు ఖుర్దా రోడ్డు చేరుకుంటుంది.

రైలు నంబర్ 08894 – ఖుర్దా రోడ్ నుండి గోండియా వరకు

తిరుగు ప్రయాణంలో జూన్ 28, 29, జూలై 1, 3, 7వ‌ తేదీలలో ఉదయం 11:00 గంటలకు ఖుర్దా రోడ్ నుండి బయలుదేరుతుంది.
ఇది మరుసటి రోజు ఉదయం 04:15 గంటలకు గోండియా చేరుకుంటుంది, ఇక్కడ ప్రధాన హాల్ట్‌లు ఉంటాయి:

  • మందిర్ హసౌద్ (22:30 గంటలు)
  • రాయ్‌పూర్ (01:00 గంటలు)
  • దుర్గ్ (01:58 గంటలు)
  • రాజ్‌నంద్‌గావ్ (02:23 గంటలు)
  • డోంగర్‌గఢ్ (02:48 గంటలు)

రైలు కోచ్‌ల‌తీరు.. ఈ ప్రత్యేక రైలు 18 కోచ్‌లను కలిగి ఉంటుంది, అన్ని రకాల ప్రయాణీకులకు అనుగుణంగా ఉంటుంది.

  • 2 AC 2-టైర్ కోచ్‌లు
  • 1 AC 3-టైర్ కోచ్
  • 7 స్లీపర్ క్లాస్ కోచ్‌లు
  • 6 జనరల్ అన్‌రిజర్వ్డ్ కోచ్‌లు
  • 2 SLR (సీటింగ్-కమ్-లగేజ్ రేక్) కోచ్‌లు

దారిలో ఉన్న ప్రధాన హాల్ట్స్:

ఎక్కువ మంది ప్ర‌యాణికుల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి ఎక్కువ స్టేష‌న్ల‌లో ఈ ప్ర‌త్యేక రైలుకు హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పించారు. ఈ రైలు ప్రధానంగా మహాసముంద్, బాగ్బహ్రా, ఖరియార్ రోడ్, నవపరా రోడ్, హరిశంకర్ రోడ్, కాంతాబంజీ, టిట్లాగఢ్, బలంగీర్, బర్గర్ రోడ్, సంబల్పూర్, ధెంకనల్, భువనేశ్వర్, ఇతర స్టేషన్లలో ఆగుతుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *