Puri Jagannath Rath Yatra | ఒడిశాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ రథయాత్ర పూరీ క్షేత్రం సన్నద్ధమవుతోంది. రథయాత్ర కోసం భారీ ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ వెల్లడించారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు సెలవు ప్రకటించారు. జూలై 7న జగన్నాథ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో అత్యున్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రథయాత్రకు
హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము
అయితే ఈసారి రథయాత్ర ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది రథయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రపతి సుముఖత వ్యక్తం చేయడం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. ఇక కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తుంటారు. జులై 7న పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రథయాత్ర ప్రత్యేకతలు..
పూరీ జగన్నాథ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది, ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర (Puri Jagannath Rath Yatra). ప్రపంచంలోనే పూరీ జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ వేడుకలను ఏటా జూన్ లేదా జూలై లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో అంగరంగ వైభవంగా భక్తి ప్రపత్తులతో ఊరేగిస్తారు.
ఈ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం ఉంటుంది. ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలతో ఈ రథకం కదులుతుంది. దాదాపు నాలుగు వేల మంది భక్తులు ఈ రథాన్ని ముందుకు లాగుతారు. నయనానందకరంగా సాగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలలా నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. కాగా రథయాత్ర కోసం ప్రతీ సంవత్సరం కొత్త రథాన్ని తయారు చేస్తుంటారు. ఈ యాత్ర పూరీ నుంచి గుండిచా దేవాలయం వరకు నిర్వహిస్తారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
One thought on “Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా”