కేరళ వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ తర్వాత వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాహుల్ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్ నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రియాంక గాంధీ 2019 నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటి చేయలేదు. గతంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె యూపీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తన మనసులో మాట బయటపెట్టారు.. కానీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) ఎన్నికల బరిలో నిలవలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని రాయ్ బరేలీ, కేరళలోని వాయనాడ్ రెండు సీట్లల్లో పోటీ చేశారు. రెండు చోట్లా భారీ మెజార్టీతో గెలిచారు. కానీ రాజ్యాంగం ప్రకారం.. ఆ రెండు సీట్లలో ఒకటి ఒదులుకోక తప్పదు. రాహుల్ వయనాడ్, రాయ్‌బరేలీల్లో ఏ సీటు వదులుకుంటారనేదానిపై ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు.
అయితే.. రాహుల్ గాంధీ.. కేరళ వయనాడ్ సీటును వదులుకునే అవకాశం ఉందని సమాచారం. దేశ రాజకీయాల్లో సోదరుడు రాహుల్ గాంధీకి సాయం చేస్తూనే.. యూపీ కాంగ్రెస్‌ని తన భుజాల మీద మోస్తున్నారు ప్రియాంక. లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్కడ కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా.. ఈసారి కాంగ్రెస్ ఆరు సీట్లు గెలుచుకోగలిగింది. 2019లో ఇది కేవలం ఒక్కటి మాత్రంగానే ఉంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..