తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  

తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  
  •  26న   ప్రారంభించనున్న ప్రధాని  మోదీ

  •  తెలంగాణలో రూ. 230 కోట్ల  నిధులతో  15 అమృత్ భారత్ స్టేషన్లు

  •  రూ.169 కోట్లతో  17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ ల నిర్మాణం

  •  రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ

Railway Development Works | మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైల్వేలలో దేశం గ‌ణ‌నీయమైన పురోగతి సాధిస్తూ వస్తోంది. కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది.  రైల్వేలలో 100 శాతం విద్యుద్దీకరణ  లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా పెద్దఎత్తున పురోగతి సాధించింది.  మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇన్నాళ్లు రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు కొత్తగా రైల్వే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయి. దేశవ్యాప్తంగా అనేక రైళ్ల గమ్యస్థానాలను పొడిగించడమే కాకుండా, వందే భారత్, అమృత్ భారత్ వంటి అత్యాధునిక రైళ్లను కూడా ప్రవేశపెట్టింది.

40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి

రైళ్లు, రైల్వే లైన్ల విస్తరణే కాకుండా రైల్వేస్టేషన్లను ఆధునీకరించి, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది.  అందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ల పేరుతో  కొత్త పథకాన్ని ప్రారంభించి  దేశవ్యాప్తంగా ఉన్న అనేక రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తోంది.  తెలంగాణలో కూడా 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు  సిద్ధం చేసింది.  ఇందుకోసం రైల్వేశాఖ మొత్తం రూ. 2,245 కోట్ల నిధులను కేటాయించింది. ఈ 40 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లకు గాను, గత ఆగస్టు నెలలో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు.  ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లతో  చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈ నెల 26 న ప్రధానమంత్రి నరేంద్రమోదీ  శంకుస్థాపన చేయనున్నారు.

 అమృత్ భారత్ స్టేషన్లు, కేటాయించిన నిధుల వివరాలు..

  •  జడ్చర్ల – రూ. 10.94 కోట్లు
  • గద్వాల్ – రూ. 9.49 కోట్లు
  • షాద్ నగర్ – రూ. 9.59 కోట్లు
  • మేడ్చల్ – రూ. 8.37 కోట్లు
  • మెదక్ – రూ. 15.31 కోట్లు
  • ఉందా నగర్ – రూ. 12.37 కోట్లు
  • బాసర – రూ. 11.33 కోట్లు
  • యాకుత్ పుర – రూ. 8.53 కోట్లు
  • మిర్యాలగూడ – రూ. 9.50 కోట్లు
  • నల్గొండ – రూ. 9.50 కోట్లు
  • వికారాబాద్ – రూ. 24.35 కోట్లు
  • పెద్దపల్లి – రూ. 26.49 కోట్లు
  • మంచిర్యాల – రూ. 26.49 కోట్లు
  • వరంగల్ – రూ. 25.41 కోట్లు
  • బేగంపేట – రూ. 22.57 కోట్లు కేటాయించబడ్డాయి.
READ MORE  గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు

రైల్వే అండర్ పాస్ లు ఇవే..

అమృత్ భారత్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని బట్టి అనేక సౌకర్యాలను కల్పించనున్నారు. అందులో ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్, స్టేషన్ కు రెండు వైపులా ఉన్న బిల్డింగులు, అన్ని ప్లాట్ ఫామ్ లను కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, పార్కింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచి, ట్రాఫిక్ ఇబ్బందుల తొలగించ‌నున్నారు.  వ‌చ్చి పోయే  ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు, లిఫ్ట్ లు, ఎస్కలేటర్ల ఏర్పాటు, దివ్యాంగుల రాకపోకలకు  సౌకర్యవంతమైన ఏర్పాట్లు, ఇల్యూమినేషన్, సైన్ బోర్డ్ ల ఏర్పాటు, ప్రయాణికుల రక్షణ కోసం అధునాతనమైన CCTV ల ఏర్పాటు, స్వయంగా స్టేషన్ కు అవసరమైన విద్యుత్ ను తయారు చేసుకునేలా గ్రీన్ బిల్డింగ్ ల ఏర్పాట్లు  ఉన్నాయి.
అమృత్ భారత్ స్టేషన్లతో పాటు ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో రూ. 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 1 రైల్ ఫ్లై ఓవర్ కు, 16 రైల్ అండర్ పాస్ లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అందులో హైదరాబాద్ డివిజన్ లోని బోధన్ వద్ద రైల్ ఫ్లై ఓవర్, మేళ్ల చెరువు, కురుముర్తి వద్ద 2, చిలకమర్రి, గౌడవల్లి, కీసర, రామాంతపూర్, పాలాట, కూచవరం వద్ద 2 మదనపూర్, గద్వాల్ వద్ద రైల్ అండర్ పాస్ లు
● సికింద్రాబాద్ డివిజన్ లోని కురచపల్లి, వెలమల, చాగల్ వద్ద రైల్ అండర్ పాస్ లు,
● గుంతకల్ డివిజన్ లోని నారాయణపేట వద్ద రైల్ అండర్ పాస్ ల నిర్మాణం జరగనుంది.
వీటితో పాటు ఆయా డివిజన్లలో రూ. 221 కోట్లకు పైగా నిధులతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 3 రైల్ ఫ్లై ఓవర్ లను, 29 రైల్ అండర్ పాస్ లను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు.
● హైదరాబాద్ డివిజన్ లోని మహబూబ్ నగర్ రూరల్, పెద్దదిన్నె, తిప్పాపూర్, గద్వాల్, సిద్దరామేశ్వర్ నగర్, బైరవాపురం, తలమడ్ల, ఇతిక్యాల, అడ్లూర్, నవీపేట్, ఉండవల్లి వద్ద రైల్ అండర్ పాస్ లను
● సికింద్రాబాద్ డివిజన్ లోని ఎర్రగుంట, ఉంకిచర్ల/నిరుపమకొండ, చర్లపల్లి వద్ద రైల్ ఫ్లై ఓవర్ లు, విలాసాగర్, బిస్ బాగ్, శివపురం, కాశీపేట్, మంచిర్యాల, బూడ, కాజీపేట్, గరిడపల్లి, మీనవోలు, బయ్యారం, దెందుకూరు, ముత్యాలగూడెం,  రాజనెల్లి, ఉప్పరపల్లి వద్ద రైల్ అండర్ పాస్ లను
● గుంటూరు డివిజన్ లోని నర్కెట్ పల్లి, కీసరజూపల్లి, బుదారం వద్ద రైల్ అండర్ పాస్ లను
● గుంతకల్ డివిజన్ లోని తంగడి వద్ద ఉన్న రైల్ అండర్ పాస్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

READ MORE  BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట గ్యాస్

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

2 thoughts on “తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *