Power Outages | హైద‌రాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..

Power Outages | హైద‌రాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..

Hyderabad | తరచూ విద్యుత్ కోతల (power outages ) తో సతమతమవుతున్న వినియోగదారులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు కొత్తగా విద్యుత్ అంబులెన్స్ ను ప్రవేశపెట్టింది సర్కారు. ఈ ప్రత్యేక వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka) సోమ‌వారం ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలందిచేందుకు అంబులెన్స్ మాదిరిగా  ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చిన‌ట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించేందుకు  అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్ విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్లలో ప్రత్యేక వాహనాలను తీసుకువచ్చారు. ఇవి 24 గంటల పాటు సేవ‌లందిస్తాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగుతారు.

READ MORE  Metro Phase - 2 | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణలో కొత్త రూట్లు ఇవే..

హైదరాబాద్ పరిధిలో 57 విద్యుత్ అంబులెన్స్ లు

కాగా హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రతీ డివిజన్ కు విద్యుత్ అంబులెన్స్ ను కేటాయించనున్నారు.ఎక్కడైనా కరెంట్ కట్ అయితే  తక్షణమే సిబ్బంది అవసరమైన యంత్ర పరికరాలతో పూర్తిస్థాయిలో వెనువెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధ‌రిస్తారు.

ఈ వాహనంలో ఏముంటాయి.?

ప్రత్యేక విద్యుత్ అంబులెన్స్ లో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరియల్ తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు.
ప్రతీ వాహనంలో థ‌ర్మో విజన్ కెమెరాలు, పవర్ సా మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ ఇతర అన్ని భద్రతా పరికరాలు ఉంటాయి. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు కూడా ఉంటాయి. వాహనాలు ట్రాన్స్ఫార్మర్లను లాగ గలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా సిబ్బంది వాటిని తక్కువ సమయంలో తరలించడానికి మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది. టిజిఏఐఎంఎస్ యాప్ (TGAIMS)  అత్యవసర ప్రదేశాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. సిబ్బంది అవసరమైన ప్రదేశానికి వేగంగా చేరుకోగ‌లుగుతారు. మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయిఈ వాహనాలు దిగ్విజయంగా సేవలు అందించాలని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

READ MORE  ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *