Postal Jobs 2024 : పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు ఇవే..
Postal Jobs 2024 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబర్ 31. ఈమేరకు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
ఏపీ, తెలంగాణల్లో పోస్టుల వివరాలు..
Postal Jobs 2024 దేశవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుండగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 15 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్) ఉద్యోగం చేస్తున్నవారు, అలాగే ఏదైనా గ్రాడ్యూషన్ (రెగ్యూలర్ లేదా డిస్టెన్స్) పూర్తిచేసి, అర్హత కలిగిన రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ఈ అవకాశం కల్పించారు.
దరఖాస్తు చేసే అభ్యర్థికి విజిలెన్స్, ఇతర ప్రవర్తనకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉండవొద్దు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 2024 అక్టోబర్ 1 నాటికి కనీస వయస్సు 20 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు…
ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే నేరుగా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.30,000 వేతనం లభిస్తుంది. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేయడంతో ఎటువంటి ఇతర బెనిఫిట్స్ లభించవు.
దరఖాస్తు విధానం…
Postal Recruitment 2024 అభ్యర్థులు తమ దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే పంపించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రూ.750 రుసుము చెల్లించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ https://ibpsonline.ibps.in/ippblsep24/ అందుబాటులో ఉంది. ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి మీ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..