PM Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే..
PM Vishwakarma Scheme Application : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. సంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థిక సాయంతోపాటు, వృత్తిలో అవసరమైన శిక్షణ అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి..
Pm Vishwakarma Yojana Scheme Updates : చేతివృత్తులు చేసుకుంటు కుటుంబాలను పోషించుకుంటున్న పేద కుటుంబాల కోసం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలుచేస్తోంది. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. ఈ పథకానికి 18 రకాల చేతివృత్తుల వారు అర్హులుగా నిర్ణయించారు. ఈ స్కీమ్ కు ఎంపికైతే రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. దీనికోసం దరఖాస్తు చేసుకునే విధానం ఇదీ..
ఎవరు అర్హులు?
సంప్రదాయ కులవృత్తులు అయిన శిల్పాలు, విగ్రహాలు చెక్కేవారు (శిల్పుఉ) , బుట్టలు, చాపలు అళ్లేవారు(మేదరులు). మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వారు, చీపుర్లు తయారీదారులు, దోబీ, టైలర్, చేప వలను తయారు చేసేవారు, చెప్పులు కుట్టేవారు, తాపీ కార్మికులు , క్షవర వృత్తిదారులు (నాయీ బ్రాహ్మణులు), సంప్రదాయ బొమ్మలు, పూల దండలు, రజకులు, పడవల తయారీదారులు, ఇంటి తాళాలు, వడ్రంగి, బంగారు ఆభరణాలు(స్వర్ణకారులు) అర్హులుగా పరిగణిస్తారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్..
PM Vishwakarma Scheme Application Process: విశ్వకర్మ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునేందుకు మొదట https://pmvishwakarma.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలి.
- దరఖాస్తు చేసుకోవాలంటే… ముందుగా పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. https://pmvishwakarma.gov.in/Login లింక్ పై క్లిక్ చేసి రిజిస్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లాగిన్ క్రియేట్ అవుతుంది.
- దరఖాస్తులో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో మొబైల్ అథెంటిఫికేషన్, ఆధార్ ఈకేవైసీ(EYC) పూర్తి చేయాల్సి ఉంటుంది.
- రెండో దశలో ఆర్టిసన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ఫాం ను ను పూర్తి చేయాలి.
- మూడో దశలో పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి పీఎం విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఇక నాలుగో దశలో స్కీమ్ కాంపోనెంట్ల (scheme component) కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 18002677777 లేదా 17923కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
ఈ దరఖాస్తును ప్రక్రియ మీ సేవా కేంద్రాల్లో కూడా పూర్తి చేసుకోవచ్చు.
అర్హతలు ఇవే..
- 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే దీనికి అర్హులు.
- దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ బుక్ కలిగి ఉండాలి.
- గడిచిన ఐదేళ్లలో ఎలాంటి రుణాలు తీసుకుని ఉండకూడదు.
- ఇంటిలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే అనర్హులు.
రుణం ఎలా అందుతుంది..?
- దరఖాస్తు చేసుకున్న తరువాత మూడు దశల్లో స్క్రీనింగ్ చేసి సెలెక్ట్ చేస్తారు.
- అర్హత పొందిన వారికి 15 రోజుల శిక్షణ ఉంటుంది . ఈ శిక్షణలో రోజుకు రూ. 500 స్కాలర్‌షిప్ అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు,
- కుల వృత్తుల వారికి పని ముట్లు (టూల్స్) కొనుగోలు చేసుకునేందుకు రూ.15,000 ఇస్తారు.
- తొలి విడతగా 5 శాతం రైతుతో వడ్డీ పై రూ.10,0000 అందిస్తారు. ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- రెండో విడతగా రూ.2 లక్షలను అందిస్తారు. మీరు తీసుకున్న రుణాన్ని 30 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..