తెలంగాణపై వరాల వర్షం కురిపించిన ప్రధాని మోదీ..పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు!

తెలంగాణపై వరాల వర్షం కురిపించిన ప్రధాని మోదీ..పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు!

తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) పర్యటిస్తున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ ‘ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వరాల వర్షం కురిపించారు.

మహబూబ్‌నగర్: తెలంగాణలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ హామీల వర్షం కురిపించారు. బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేశాం.. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముందే శక్తి పూజలు ప్రారంభించాము. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు త్వరలోనే మెరుగవుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్‌ పార్కులు, 4 ఫిషింగ్‌ క్టస్టర్లు నిర్మిస్తాం. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం, రూ.900 కోట్లతో సమక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ స్థాయిని పెంచడం’’ వటి ప్రధాన హామీలను మోదీ ప్రకటించారు.

READ MORE  Zodiac Sign | వారఫలితాలు తేదీ 10 మార్చి 2024 ఆదివారం నుంచి 16 శనివారం వరకు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *