PM Internship Scheme 2024 Registrations | PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ విండో నవంబర్ 10, 2024న ముగియనుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.inలో సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చు.
PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 గురించి
PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద 24 రంగాలలో 80,000 ఇంటర్న్‌షిప్ పొజిషన్‌లను అందిస్తుంది, ఇందులో ప్రముఖ కంపెనీలు మహీంద్రా & మహీంద్రా, L&T, టాటా గ్రూప్, అదానీ గ్రూప్, కోకాకోలా, ఐషర్, డెలాయిట్, మహీంద్రా గ్రూప్, మారుతీ సుజుకీ, పెప్సికో, హెచ్‌డిఎఫ్‌సి, విప్రో, ఐసిఐసిఐ, హిందుస్తాన్ యూనిలీవర్, శాంసంగ్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి 500 సంస్థలు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద భాగస్వాములయ్యాయి.
అర్హత ప్రమాణాలు:
- అభ్యర్థులు హైస్కూల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉత్తీర్ణులై ఉండాలి, ITI నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా కలిగి ఉండాలి లేదా BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma వంటి డిగ్రీలతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
- దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థి భారతీయుడై ఉండాలి,
- అభ్యర్థి పూర్తి సమయం ఉద్యోగం చేయకూడదు, పూర్తి సమయం విద్యలో నిమగ్నమై ఉండకూడదు.
- ఆన్‌లైన్ / దూరవిద్య ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
PM Internship Scheme : దరఖాస్తు చేయడానికి దశలు
- PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.inలో సందర్శించండి.
- రిజిస్టర్ లింక్‌పై క్లిక్ చేయండి.. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయండి. ఆతర్వాత సబ్‌మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు అందించిన సమాచారం ఆధారంగా, పోర్టల్ ద్వారా రెజ్యూమ్ రూపొందిస్తుంది.
- ప్రాధాన్యతల ఆధారంగా 5 వరకు (location, sector, functional role and qualifications) ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోండి.
- వివరాలు నమోదు పూర్తయిన తర్వాత, సబ్‌మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి, కన్ఫిర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేయండి.
- తదుపరి అవసరాల కోసం అదే హార్డ్ కాపీని భద్రపరుచుకోండి..
- మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టైపెండ్ వివరాలు
ఇంటర్న్‌లకు నెలవారీ రూ. 5,000 స్టైఫండ్ లభిస్తుంది. ఇందులో రూ.500 హోస్ట్ కంపెనీ తమ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా జమ చేయగా, మిగిలిన రూ.4,500 ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతులు (OBC) రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగా వర్తింపజేస్తుంది.