‘చనిపోయిన’వారికి రూ. 2 కోట్ల విలువైన పెన్షన్లు ఇచ్చేశారు.. అత్యధికంగా ఈ రాష్ట్రాల్లోనే..
ప్రభుత్వ పథకం దుర్వినియోగంపై కాగ్ ధ్వజం
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘చనిపోయిన’ లబ్ధిదారులకు కూడా పెన్షన్ల చెల్లించినట్లు కాంగ్ గుర్తించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (National Social Assistance Programme -NSAP) అమలులో అనేక అవకతవకలను గుర్తించింది. బీపీఎల్ కింద పేదరికంలో ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లను అందించడానికి కేంద్రం అందిస్తున్న పథకం. ఒక నివేదిక ప్రకారం 2017 నుండి 2021 వరకు 26 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దాదాపు 2,103 మంది లబ్ధిదారులకు వారి మరణానంతరం కూడా రూ. 2 కోట్ల పెన్షన్లు చెల్లించాయి
NSAP మార్గదర్శకాల ప్రకారం, లబ్ధిదారుల మరణం, వలసలు లేదా వారు BPL బెంచ్‌మార్క్‌ను దాటిన తర్వాత పెన్షన్ (pensions) చెల్లింపు ఆగిపోతుంది. అయితే, వివిధ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు మరణాలను సకాలంలో అప్డేట్ చేయడంలో విఫలమయ్యాయని. ఇది జీవించి లేని లేని వ్యక్తులకు పింఛన్లను అధికంగా చెల్లించడానికి కారణమైందని ఆ నివేదిక వెల్లడించింది.
అత్యధికంగా ఈ రాష్ట్రాల్లోనే
26 రాష్ట్రాల్లో మరణించిన తర్వాత కూడా లబ్ధిదారులకు చెల్లింపులు జరగగా, పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా రూ.83.27 లక్షల విలువైన 453 ఖాతాలు ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ లో 413 ఖాతాలకు రూ.11.83 లక్షల విలువైన చెల్లింపులు జరగగా త్రిపురలో వరుసగా 250 ఖాతాలు , రూ. 1.83 లక్షల విలువైన పెన్షన్లు చెల్లించారు. ఇక మణిపూర్, మిజోరాం, పుదుచ్చేరిలలో ‘చనిపోయిన’ లబ్ధిదారులకు అతి తక్కువ మొత్తంలో పింఛన్లు చెల్లించారు.
NSAP మార్గదర్శకాలకు విరుద్ధంగా దాదాపు 13 రాష్ట్రాలు 2.4 లక్షల మంది లబ్ధిదారులకు తక్కువ మొత్తంలో పెన్షన్లను చెల్లించాయని, ఫలితంగా రూ. 42.85 కోట్ల మేర తక్కువ చెల్లింపు జరిగిందని కాగ్ (Comptroller and Auditor General) అధ్యయనం వెల్లించింది. మరోవైపు నాలుగు రాష్ట్రాలు – త్రిపుర, మణిపూర్, మిజోరాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో పరిమితికి మించి లబ్ధిదారులకు పెన్షన్లు చెల్లించాయి.
NSAP మార్గదర్శకాలు 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లబ్ధిదారులకు, అనేక ఉప-పథకాల క్రింద – IGNOAPS, IGNWPS, IGNDPS – నెలవారీ రూ. 200 మరియు రూ. 300 చెల్లించాలని పేర్కొన్నాయి. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉన్న లబ్ధిదారులు నెలకు రూ. 500 పొందుతారు .
ఈ పథకంపై సమాచారం, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (IEC) కార్యకలాపాల కోసం కేటాయించిన సుమారు రూ. 2.83 కోట్ల నిధులు ఇతర పథకాల ప్రచారం కోసం మళ్లించబడ్డాయని తేలింది. అదేవిధంగా, ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ. 57.45 కోట్ల నిధులు ఇతర పథకాల కోసం మళ్లించబడ్డాయి.
CAG ప్రకారం, అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ప్రత్యేక ధృవీకరణ బృందాలను ఏర్పాటు చేయకపోవడం, ఏడాదికోసారి వెరిఫికేషన్ చేయకపోవడం, సరైన గుర్తింపు కోసం నిర్దేశిత ప్రక్రియ లేకపోవడం. లబ్ధిదారులు IEC కార్యకలాపాలు లేకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల పథకం దుర్వనియోగమైనట్లు తేలింది.
Electric Vehicles కి సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర పోర్టల్, తాజా వార్తల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..
అలాగే ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.