Posted in

రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?

Spread the love

గాజా స్ట్రిప్ (Gaza strip), వెస్ట్ బ్యాంక్ ఏంటి..?

ఇజ్రాయెల్‌- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ పేర్లు తరచూ వినిపిస్తున్నాయి.. అసలు ఈ గాజా, వెస్ట్ బ్యంక్ అంటే ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం..

పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వతప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీరప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది.
కాగా 1949లో ఏర్పడిన ‘అర్మిస్టైస్ రేఖ’ ద్వారా పాలస్తీనా విభజన జరిగింది. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం ఈ రేఖ ఏర్పడింది.
పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా (Gaza) స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ విస్తీర్ణం 5,970 చదరపు కిలోమీటర్లు ఉండగా, గాజా స్ట్రిప్ విస్తీర్ణం 365 చదరపు కిలోమీటర్లు. వెస్ట్ బ్యాంక్ జెరూసలెంకు, జోర్డాన్ కు తూర్పు భాగంలో ఉంది.
అయితే పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండూ కూడా జెరూసలెంను తమ రాజధానిగా ప్రకటించుకున్నాయి.

ఒకప్పుడు ఇజ్రాయెల్ పై తటస్థంగా ఉన్న భారతదేశం ఇప్పుడు మిత్రుడిగా ఎలా నిలిచింది..?

గాజా స్ట్రిప్ సరిహద్దులు..

గాజా స్ట్రిప్ భౌగోళికంగా 41 కిలోమీటర్ల పొడవు.. 6 నుంచి 12 కిమీ వెడల్పు ఉంటుంది.
గాజా సరిహద్దులను పరిశీలిస్తే.. ఇజ్రాయెల్‌ వెంబడి 51 కిలోమీటర్లు, ఈజిప్టు వెంబడి ఏడు కిలోమీటర్లు, మధ్యధరా తీరం వెంబడి 40 కి.మీ ఉంటుంది. గాజా స్ట్రిప్‌లో 22 లక్షల మంది నివసిస్తున్నారు

1967 యుద్ధంలో గాజా స్ట్రిప్ ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. 2005 లో గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పటికీ, ఐక్యరాజ్యసమితి ఆ భూమిని ఇప్పటికీ కూడా ఆక్రమిత భూ భాగంగానే పరిగణిస్తున్నది. ఇక్కడి ప్రజలు, వస్తువులు, అన్ని రకాల సేవలు, గాలి, నీరు, సముద్రంపై ఇంకా ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం గాజా, పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ ‘హమాస్’ పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్ తో అనేక సార్లు పోరాడింది.

ఇక వెస్ట్ బ్యాంక్, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ నియంత్రణలో ఉంది. ఇక పాలస్తీనియన్ నేషనల్ అథారిటీని అంతర్జాతీయ సమాజం పాలస్తీనా ప్రభుత్వంగా గుర్తిస్తుంది.

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *