Saturday, August 30Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి

జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి

National
వచ్చే జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం Ayodhya temple construction work: అయోధ్యలోని మూడు అంతస్థుల రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 2020లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది.“ఈ నెలాఖరు నాటికి, ఆలయం మొదటి అంతస్తు ప్రారంభమవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది ”అని అన్నారు. ఆగస్టు 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కాగా సీనియర్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని లార్సెన్ &...
దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

Crime, National
పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్‌ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్ తో ధ్వంసం చేశారు. సంబంధిత పాఠశాలలో ముస్లిమేతర బాలికలను 'హిజాబ్' ధరించమని బలవంతం చేసిన కేసులో Ganga Jamna Higher Secondary School పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత మంగళవారం పాఠశాలలో అనధికార నిర్మాణాల తొలగింపు చేపట్టారు.స్థానిక మునిసిపాలిటీల బృందాలు  పాఠశాల (Damoh school ) మొదటి అంతస్తును కూల్చివేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి సీనియర్ డామోహ్ జిల్లా పోలీసు అధికారి ప్రకారం, పాఠశాల ఆవరణలో అనధికారిక నిర్మాణాలకు సంబంధించి స్థానిక మునిసిపాలిటీ ఇటీవల పాఠశాలకు (కేంద్ర ప్రభుత్వ-సహాయక మైనారిటీ పాఠశాల) నోటీసు అందించింది. స్థానిక మున్సిపాలిటీ జారీ చేసిన నోటీసులో పాఠశాలకు మూడు రోజ...
మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు

మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు

National
హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ దేశంలోని అనేక ప్రాంతాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 దాటిందంటే చాలు ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. అయితే భారత వాతావరణ శాఖ (IMD)  Indian Meteorological Department షాకింగ్ న్యూస్ వెలువరించింది. మరో ఐదు రోజుల పాటు బీహార్, జార్ఖండ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతల్లో హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.జూన్ 11-13 మధ్య దక్షిణ హర్యానా-ఢిల్లీ, దక్షిణ ఉత్తరప్రదేశ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశాలో. అలాగే జూన్ 12న హిమాలయ పశ్చిమ బెంగాల్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో హీట్‌వేవ్ పరిస్థితులు కూడా ఉంటాయని అంచనా. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, నాన్ ఎయిడెడ్ (మైనారిటీతో సహా) రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12 నుంచి జూన్ 14 వరకు మూసివేశారు. బీహార...
ఇతడు భిక్షగాడు కాదు.. కనిపించే భగవంతుడు

ఇతడు భిక్షగాడు కాదు.. కనిపించే భగవంతుడు

National
రూ.50లక్షలు విరాళం అందించిన పూల్ పాండియన్ చెన్నై: పూల్ పాండియన్ చూడ్డానికి యాచకుడే కానీ అతడి ఉన్నత వ్యక్తిత్త్వం మందు కోటీశ్వరులు కూడా దిగదుడుపే.. ఏళ్ల తరబడి ఎండనకా వాననగా రోడ్లపై సంచరిస్తూ అడుక్కొని సేకరించిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు విడతలుగా విరాళంగా ఇచ్చారు. 75 ఏళ్ల పూల్ పాండియన్ (Pool pandian) 2010 నుంచే ఇలా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల రూపాయలను పోగు చేసి ప్రభుత్వానికి విరాళంగా అందించారు. గతనెల పూల్పాండియన్ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీ జాన్ వర్గీస్ ను కలుసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తన చివరి విరాళం రూ.10,000 అందజేశారు. భిక్ష కోసం తిరిగి తిరిగి అలసిపోయానని, వయసు సంబంధిత సమస్యలతో భిక్షాటన కష్టమైపోతోందని, విరాళం ఇవ్వడం ఇదే చివరి సారి అని పూల్ పాండియన్ తెలిపారు. తనకు ఇల్లు లేదని, ఏదైనా ఆశ్రమాన్ని చేరుకొని అక్కడే శేష జీవితం గడుపుతానని తెలి...
ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం

ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం

National
odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలును ఢీకొట్టింది, దీనివల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక క్యారేజ్ మూడవ ట్రాక్‌పైకి వెళ్లింది. మూడో ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లింది. కారణం గుర్తించాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన  రైలు ప్రమాదానికి మూలకారణాన్ని గుర్తించామని, అయితే అది ఏమిటో వెల్లడించలేమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను స్వాధీనం చే...
యుద్ధప్రాతిపదికన  రైల్వే పునరుద్ధరణ పనులు 

యుద్ధప్రాతిపదికన  రైల్వే పునరుద్ధరణ పనులు 

National
odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది. ఏడు కంటే ఎక్కువ పొక్లెయిన్ మెషీన్లు, రెండు ప్రమాద సహాయ రైళ్లు, 3-4 రైల్వే, రోడ్ క్రేన్‌లను ముందస్తుగా పునరుద్ధరణ కోసం మోహరించినట్లు రైల్వే తెలిపింది. అంతకుముందు, శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలానికి సందర్శించి మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రధాని వెంట కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు కూడా ఉన్నారు."ఇది బాధాకరమైన సంఘటన. మేము కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము, కానీ ఈ దుఃఖ సమయంలో మేము బాధిత కుటుంబాల వెంటే ఉన్నాము. ఈ సంఘటనను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. గాయపడిన ...
ఒడిశాలో మృత్యుఘోష

ఒడిశాలో మృత్యుఘోష

National
నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు 278కి చేరిన మృతుల సంఖ్య Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 మంది గాయపడ్డారు. 20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అని అధికారులు శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, కటక్‌లోని ఆసుపత్రులలో గాయపడిన వారిని పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదం పెనువిషాదాన్ని నింపింది.ఈ ప్రమాదంలో ఒక రైలు మరొకదానిపైకి బలంగా ఢీకొట్టింది. తద్వారా బోగీలు గాలిలోకి ఎగిరిపడ్డాయి. ఆపై ట్రాక్‌లు మెలితిప్పినట్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా తెగిపోయిన ...
ఆకతాయిలకు షాక్ ఇచ్చే చెప్పులు ఇవి..

ఆకతాయిలకు షాక్ ఇచ్చే చెప్పులు ఇవి..

National
మహిళల కోసం ఎలక్ట్రిక్ చెప్పులుఇంటర్ విద్యార్థి ఘనతఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు పక్కన ఎవరూ లేకపోతే మహిళలు దుండగుల దాడులు చేసేవారికి బలవ్వాల్సిందే. అయితే ఇలాంటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు చక్కని ఆవిష్కరణ చేశాడు.. ఇక నుంచి మహిళలు/ యువతులు వారు వేసుకునే చెప్పులతోనే రక్షించుకునేలా ఒక డివైజ్ కనుగొన్నాడు. వివరాల్లోకి వెళ్తే..  ఝార్ఖండ్ రాష్ట్రం లోని ఛత్రాకు చెందిన ఇంటర్ ‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మంజీత్.. 'విమెన్‌ సేఫ్టీ డివైజ్‌' పేరుతో ఎలక్ట్రిక్ చెప్పులను రూపొందించాడు. మహిళలు, బాలికలపై ఎవరైనా దాడులకు పాల్పడితే వారు వేసుకున్న ఈ ఎలక్ట్రిక్ చెప్పులతో ఆ ఆకతాయిలను తంతే వారికి కరెంట్‌ షాక్‌ కు గురై అక్కడికక్కడే కింద పడ...
సికింద్రాబాద్ నుంచి మరో  భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్

సికింద్రాబాద్ నుంచి మరో  భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్

National
మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వేహైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా  మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్  దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది.కొత్త  భారత్ గౌరవ్ రైలు (bharat gaurav tourist train) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో స్టాప్‌లతో ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన  చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తుంది . 8 రాత్రులు, 9 రోజుల ప్యాకేజీ వైష్ణో దేవి ఆలయ దర్శన ఏర్పాటును కూడా కవర్ చేస్తుంది. అయితే, కటారా నుంచి ఆలయానికి పోనీ లేదా డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్ చేసుకోవాలి. ఈ రైలు ద్వారా ప్రయాణికులకు వసతి, ఆహారం వంటి...
Generic Medicine: జనరిక్‌ మందులే రాయాలి.. డాక్టర్లకు కేంద్రం ఆదేశం

Generic Medicine: జనరిక్‌ మందులే రాయాలి.. డాక్టర్లకు కేంద్రం ఆదేశం

National
Generic Medicine : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతీ ఆస్పత్రి, వెల్‌నెస్‌ సెంటర్లు ఇక నుంచి తప్పనిసరిగా తక్కువ ధరకు లభించే జనరిక్‌ మందులను మాత్రమే  రోగులకు సిఫార్సు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలా ప్రిస్ర్కైబ్‌ చేయని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘ప్రభుత్వ ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద కొనసాగే స్వస్థత కేంద్రాలు, పాలీక్లినిక్‌లు..  ఇక మీదట రోగులకు జనరిక్‌ మందులను మాత్రమే రాయాలి. కొంతమంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ప్రసిద్ధి చెందిన కంపెనీల మందులను మాత్రమే రోగులకు ప్రిస్ర్కైబ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలాంటి వారిపై ఉన్నతాధికారుల నిఘా ఉంటుందన్న విషయాన్ని మరవొద్దు’ అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర అతుల్‌ గోయల్‌ తన ఆదేశాలలో పేర్కొన్నారు.తమ ఆధ్యర్యంలోని డాక్టర్లు జనరిక్‌ మందులే (Generic Medicine) రోగులకు సిఫా...