తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత
Spread the love

ముంబై: సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్‌ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నాగ్ పూర్‌ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరుగులుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ముంబై-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు

Fire breaks out in Mumbai-Bengaluru Udyan Express

ముంబై-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలు (Mumbai-Bengaluru Udyan Express) గమ్యస్థానానికి చేరుకున్న రెండు గంటల తర్వాత మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రెండు కోచ్‌ల నుంచి పొగలు రావడంతో మంటలు(Fire) చెలరేగాయి. KSR బెంగళూరు స్టేషన్‌లో అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఎటువంటి గాయాలు సంభవించలేదని రైల్వే అధికారులు తెలిపారు.
“ఉద్యన్ ఎక్స్‌ప్రెస్ క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మంటలు చెలరేగాయి. ప్రయాణికులు రైలు దిగిన రెండు గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాణనష్టం లేదా గాయాలు లేవు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు” అని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు.

READ MORE  Bangladesh Crisis | బంగ్లాదేశ్‌తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్ నుంచి మోదీకి ఫోన్‌..

 


Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *