RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’
దేశ అజరామర సంస్కృతికి మహావృక్షం ఆర్ఎస్ఎస్నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీNagpur : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) జయంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని మోదీ తొలిసారిగా నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పక్కనే నిలబడి ప్రసంగించిన మోదీ (PM Modi).. సామాజిక సేవ కోసం ఆర్ఎస్ఎస్ అంకితభావంతో పనిచేస్తోందని కొనియాడారు. వరదలు, భూకంపాలు, ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో వారి నిస్వార్థ సేవ స్పష్టంగా కనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. సేవ ఉన్న చోటల్లా స్వచ్ఛంద సేవకులు ఉంటారని ఆయన అన్నారు. మహా కుంభమేళా అయినా...