Wednesday, January 28"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

నస్రల్లా మరణంతో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసిన మెహబూబా ముఫ్తీ

Spread the love

హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యను ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ఈరోజు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. లెబనాన్, గాజాలోని ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె స్ప‌ష్టం చేశారు.

Highlights

“లెబనాన్ & గాజా అమరవీరులకు ముఖ్యంగా హసన్ నసరుల్లాకు సంఘీభావంగా ఆదివారం ప్రచారాన్ని రద్దు చేస్తున్నాన‌ని, తాను పాలస్తీనా & లెబనాన్ ప్రజలకు అండగా నిలుస్తామ‌ని మెహబూబా ముఫ్తీ మె X లో ఒక పోస్ట్‌లో రాశారు.

టెర్రర్ గ్రూప్‌పై తమ విజయవంతమైన దాడిని గురించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) Xలో ఒక పోస్ట్‌లో, “Hassan Nasrallah ఇకపై ప్రపంచాన్ని భయపెట్టలేరు” అని రాసింది. అయితే సెప్టెంబరు 28న హిజ్బుల్లా తన నాయకుడు, సహ వ్యవస్థాపకుడు హసన్ నస్రల్లా రోజు బీరుట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు హిజ్బుల్లా కూడా ధృవీకరించింది. నస్రల్లా “తన తోటి అమరవీరులతో చేరాడు” “శత్రువుపై పవిత్ర యుద్ధాన్ని కొనసాగిస్తానని ఈ సంద‌ర్భంగా హిజ్బుల్లా ప్రతిజ్ఞ చేసింది.

కాగా జమ్మూ కాశ్మీర్ సెప్టెంబర్ 28 న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యను ఖండిస్తూ ప్రజలు వీధుల్లోకి రావడంతో పాటు ప్రదర్శనలు జరిగాయి. బుద్గామ్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో మహిళలు, పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హిజ్బుల్లా చీఫ్ చిత్రపటాలను పట్టుకున్నారు. శృంగర్ పాతబస్తీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిరసనలు జరిగాయి.


 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *