Thursday, April 17Welcome to Vandebhaarath

Job Notification | నిరుద్యోగ యువ‌త‌కు తీపి క‌బురు .. వైద్య‌శాఖ‌లో ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

Spread the love

Job Notification In Medical Department: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (Medical Recruitment Board) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాగా, గత నెలలో విడుదల చేసిన ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మెడిక‌ల్‌ బోర్డు ప్ర‌క‌టించింది. గత నెలలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అదనంగా మరో 272 పోస్టులను చేర్చింది. ఈ క్రమంలో మొత్తంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 2,322కు చేరాయి. ఈ నెల 14లోగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని.. నవంబర్ 17వ తేదీన ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్ల‌డించింది.

READ MORE  Job alert 2025 | ఇండియ‌న్ రైల్వేస్‌లో 1,036 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

కాగా గత నెలలో 633 ఫార్మాసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలుపుతూ తాజాగా మరో నోటిఫికేషన్ (Job Notification) విడుద‌ల‌ చేసింది. ఇప్పుడు మొత్తం ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య 732కు చేరగా.. వీటికి సంబంధించి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 30న పరీక్ష నిర్వహిస్తామని మెడిక‌ల్ రిక్రూట్ మెంట్‌ బోర్డు తెలిపింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

READ MORE  Crop Loans | రూ.2 లక్షల రుణమాఫీకి ఎన్నో సవాళ్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *