పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్ వాహనంతో పరార్
చండీగఢ్: పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ వాహనంతోనే పరారయ్యాడు (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఒక చోట పోలీస్ వాహనం కనిపించింది. కానీ లాక్ చేసి ఉండటంతో కీ కోసం ఆ ప్రాంతంలో మళ్ళీ వెతికారు. హర్యానాలోని యమునా నగర్ జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఖుర్ది గ్రామంలో ఒక కుటుంబ కలహాలకు సంభందించిన వివాదంపై పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ ( ERV )లో పోలీసులు(Haryana Police) ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు ఘర్షణ పడటం వీరి కంట పడింది.. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోనికి ఎక్కించారు.
కాగా, పోలీసులు అనంతరం ఆ గ్రామానికి వెళ్లారు.. ఫోన్ చేసిన ఇంటికి వెళ్లి ఫిర్యాదుపై ఆరా తీయడంలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ఇంతలో పోలీసు వాహనంలో ఉన్న వ్యక్తి దానిని డ్రైవ్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు.. ఆ వెంటనే పోలీస్ బైక్‌ల మీద బయలుదేరి మాయమైన పోలీస్ వాహనం కోసం వెతికారు. సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వదిలేసిన ఆ వాహనాన్ని గుర్తించారు.
అయితే.. ఆ పోలీస్ వాహనం లాక్ చేసి ఉండటంతో ఆ వ్యక్తి కారు తాళం అక్కడే పడేసి ఉంటాడని పోలీసులు భావించారు. పోలీస్ వాహనం కీ కోసం ఆ పరిసర ప్రాంతాల్లో వెతికారు. పోలీస్ వాహనం చోరీ చేసి పోలీసులను(Haryana Police) ఇబ్బందులకు గురిచేసిన ఆ వ్యక్తిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.