Rs 500 Gas Cylinder Scheme: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం ప్రారంభించారు. అలాగే రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు.
హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా తెలంగాణ సర్కారు ((Telangana Government) మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. పథకాన్ని ఎలా అమలు చేస్తారు? ఈ పథకానికి ఎవరు అర్హులు? వంటి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ అందించే పథకానికి సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
- సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది.
- సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన వారి జాబితా ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు.
- ఈ పథకానికి అర్హులుగా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం.
- మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని సరాసరి ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లుు కేటాయిస్తారు.
- వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత వినియోగదారుల బ్యాంకు ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ చేయనున్నారు.
- గ్యాస్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా OMC సంస్థలకు ఇస్తుంది. సంస్థల నుంచి DBT ద్వారా వినియోగదారులకు నగదు చెల్లిస్తారు.
- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు.
- భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం రూ. 500 చెల్లించేలా ఏర్పాటు చేయనుంది.
- 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్‌లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ ఫర్ అయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
లబ్దిదారుల ఎంపిక ఎలా ?
రూ.500లకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. పాత కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే గ్యాస్ సబ్సిడీ (Gas Subsidy) ని వర్తింపజేయనున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 గ్యాస్ సిలిండర్ లబ్దిదారులను ఎంపికకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని ఆశావర్కర్ల సాయంతో లబ్దిదారులను ఎంపిక చేసింది. ఆశా కార్యకర్తలు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి రేషన్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు. వివరాలను నమోదు చేసుకుంటున్నారు. కాగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అందుతుంది. తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. వీటిలో 64 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రస్తుతానికి రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కానున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..