Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు
Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది ‘కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవలం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు.
18 శాతం మందిపై క్రిమినల్ కేసులు
లోక్‌సభ ఎన్నికల మూడో విడత (Third Phase Voting ) లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ఇందులో ఏడుగురు అభ్యర్థులు ముందస్తు నేరారోపణలు ప్రకటించారు. మూడో విడతలో పోటీ చేస్తున్న 244 మంది నేరచరిత్ర కలిగిన అభ్యర్థుల్లో ఐదుగురిపై హత్యకు సంబంధించిన ఆరోపణలు ఉండగా, 24 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇంకా, 38 మంది అభ్యర్థులు మహిళలలకు సంబంధించిన కేసులను కలిగి ఉన్నారు. 17 మంది ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.
విద్యార్హతలు
అభ్యర్థుల్లో 47 శాతం( 639 మంది )అభ్యర్థులు 5 నుండి 12 తరగతుల వరకు విద్యార్హతలను కలిగి ఉన్నారని, 44 శాతం (591 మంది) అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు లేదా ఉన్నత విద్యార్హతలను కలిగి ఉన్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
వయస్సు పరంగా 30 శాతం (411 మంది) అభ్యర్థులు 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉండగా 53 శాతం (712 మంది) అభ్యర్థులు 41 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..