Telangana

Local Body Polls | గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Spread the love

3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం

హైద‌రాబాద్ : మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు (Local Body Polls ) నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి సంబంధించిన ఆరు పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ జస్టిస్ టి. మాధవి దేవి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వాదనలు ముగిసిన తర్వాత ఈ వారం ప్రారంభంలో కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఈ తీర్పు వెలువడింది.

హైకోర్టు ఆదేశాల‌తో త్వరలోనే తెలంగాణ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Polls ) నిర్వాహణపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 3 నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని న్యాయ‌స్థానం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే రిజర్వేషన్లు పూర్తి చేయడానికి మరో 30 రోజుల గడువు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరడంపై కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్ధనను పరిశీలించింది. 2024 జనవరిలో గ్రామ పంచాయతీల పాలక వర్గం గడువు ముగిసింది. అంటే 17 నెలలుగా పాలక వర్గాలు లేకుండానే గ్రామ పంచాయతీలు కొనసాగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన 6 పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కాగా మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *