Home » LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..
LIC Bima Sakhi Yojana

LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..

Spread the love

LIC Bima Sakhi Yojana : ఎల్‌ఐసి బీమా సఖీ యోజన డిసెంబర్ 9వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం హర్యానా పర్యటనలో ఉన్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు పానిపట్ నుంచి బీమా సఖీ పథకాన్ని ప్రారంభించనున్నారు. LIC ప్రత్యేక పథకం లాచ్ సంద‌ర్భంగా PM మోడీ బీమా సఖీలకు అపాయింట్‌మెంట్ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు.

LIC Bima Sakhi : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ పాల‌సీ ప్రకారం.. పదోతరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సాధికారత కల్పించడానికి రూపొందించారు. ఈ పథకం కింద, విద్యావంతులైన మహిళలకు మొదటి 3 సంవత్సరాలు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజలలో ఆర్థిక అవగాహన పెంచడానికి, బీమా ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మహిళలు కూడా కొంత డబ్బు అందిస్తారు. మూడు సంవత్సరాల శిక్షణ తర్వాత, ఈ మెట్రిక్యులేటెడ్ మహిళలు ఎల్‌ఐసిలో బీమా ఏజెంట్లుగా పని చేస్తారు. ఇది కాకుండా బ్యాచిలర్ డిగ్రీ పాసయిన బీమా సఖీలకు ఎల్‌ఐసిలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశం లభిస్తుంది.

READ MORE  Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్ 

LIC Bima Sakhi Yojana : ఎవరికి ప్రయోజనం లభిస్తుంది?

  • 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యావంతులైన మహిళలు
  • కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు.
  • శిక్షణ సమయంలో భృతి అందిస్తారు.
  • శిక్షణ పూర్తయిన తర్వాత, 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు ఎల్‌ఐసి ఏజెంట్‌గా అంటే బీమా ఏజెంట్‌గా ఉపాది క‌ల్పిస్తారు.
  • బ్యాచిలర్ పాస్ బీమా సఖీలకు ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశం ఉంటుంది.
READ MORE  Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

చదువుకున్న మహిళల కోసం ఎల్‌ఐసీ బీమా సఖీ పథకాన్ని రూపొందించింది. వారిని ఆర్థికంగా
స్వావలంబన చేయడమే దీని లక్ష్యం. ఈ పథకం కింద 10వ తరగతి చదువుతున్న మహిళలకు 3 సంవత్సరాల పాటు శిక్షణ ఇచ్చి ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించుకుని, బీమా ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యేలా చేస్తారు. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి కోసం ఈ స్కీమ్ ను ప్రారంబించారు.

బీమా సఖీ యోజన కింద రూ.7,000 వరకు స్టైపెండ్

‘బీమా సఖీ యోజన’ హర్యానాకు చెందిన 8,000 మందితో సహా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు ఎల్‌ఐసి ఏజెంట్లుగా శిక్షణ ఇస్తుంది. శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో రూ. 7,000, రెండవ సంవత్సరంలో రూ. 6,000, మూడవ సంవత్సరంలో రూ. 5,000 నెలవారీ స్టైఫండ్‌ను అందించనున్నారు.

READ MORE  Railway jobs : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. రైల్వేలో 8,113 పోస్టులతో నోటిఫికేష‌న్‌..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..