Saturday, July 5Welcome to Vandebhaarath

జార్జ్ సోరోస్ సంస్థతో సోనియాగాంధీకి లింక్.. కాంగ్రెస్ పై బిజెపి ఫైర్..

Spread the love

Congress Party | జార్జ్ సోరోస్ (George Soros) ఫౌండేషన్ సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయంటూ భారతీయ జనతా పార్టీ (BJP) చేసిన ఆరోపణలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) సోమవారం స్పందించారు. ఇలాంటి అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. దేశ రాజధానిలో ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ.. భారత వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, దాని కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని ఆయన కోరారు. “దేశం ముందున్న కొన్ని సమస్యలను రాజకీయ దృక్కోణంతో చూడకూడదని నేను భావిస్తున్నాను. జార్జ్ సోరోస్ .. వెలుగులోకి వ‌చ్చిన అతని లింకులు – మేము దీనిని కాంగ్రెస్ పార్టీకి లేదా రాహుల్ గాంధీకి సంబంధించిన సమస్యగా చూడము. ఇది భారత వ్యతిరేక శక్తులకు సంబంధించినదిగా గుర్తించాల‌ని అన్నారు.

కాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పై బిజెపి చేసిన ఆరోపణలు పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కాశ్మీర్ (Kashmir) స్వతంత్ర దేశంగా ‘మద్దతు’ ఇచ్చిన జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చే సంస్థతో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని అధికార పార్టీ పేర్కొంది.

సోనియా గాంధీకి, వ్యాపారవేత్త జార్జ్ సోరోస్‌కు మధ్య ఉన్న సంబంధాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలను రాజకీయంగా చూడరాదని, భారత వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. “మేము దీన్ని పార్టీ రాజకీయాలుగా చూడటం లేదు.. డిసెంబర్ 13, 14 తేదీల్లో (లోక్‌సభలో), డిసెంబర్ 16, 17 తేదీల్లో (రాజ్యసభలో) చర్చిస్తామని కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెప్పాము. తమ నాయకులకు కూడా భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నట్లు తేలితే, వారు కూడా గళం విప్పాలని, మనం ఐక్యంగా ఉండి భారత వ్యతిరేక శక్తులపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నానని కిరణ్ రిజుజు అన్నారు.
కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకునే ఉద్దేశం తనకు లేదని రిజిజు పేర్కొన్నారు, అయితే భారత కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎత్తి చూపారు.

ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జార్జ్ సోరోస్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని బీజేపీ గతంలో ఆరోపించింది.

శుక్రవారం, బిజెపి ఎంపి నిషికాంత్ దూబే X లో ఇలా రాశారు, “కాంగ్రెస్ జార్జ్ సోరోస్‌తో చేతులు కలిపింది, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సోరోస్ నిధులు సమకూర్చారా లేదా, విదేశాలలో చదువుకోవడానికి సోరోస్ 1000 మంది భారతీయ పిల్లలకు నిధులు ఇచ్చారు. ఎంతమంది వారిలో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉననారు. ? కాంగ్రెస్ పార్టీకి నా ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. అని పేర్కొన్నారు.

జార్జ్ సోరోస్ ఎవరు?

Who is George Soros : ప్రపంచ కుభేరుల్లో ఒకరైన జార్జ్‌ సోరోస్‌.. హంగేరీలో ఓ జూయిష్ (యూదు) కుటుంబంలో 1930లో జన్మించాడు. నాజీల రంగ ప్రవేశంతో.. ఆయన కుటుంబం 1947లో లండన్‌కు వలస వెళ్లింది. అక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తిచేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ చ‌దివేందుకు సోరోస్ రైల్వే పోర్టర్, వెయిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత లండన్‌లోనే ఓ ప్రముఖ బ్యాంక్‌లో కొంతకాలం పని చేసి.. 1956లో ఆయన న్యూయార్క్‌కు వెళ్లి యూరోపియన్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌గా పని చేయడం మొదలు పెట్టారు. 1973లో హెడ్గే ఫండ్‌(పూల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) పేరుతో ఆర్థిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించారు.
బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. ఆయన వద్ద సుమారు 8.5 బిలియన్‌ డాలర్ల సంపద ఉంది. ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్స్‌ పేరుతో ఛారిటీ పనులు చేస్తుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, పాదర్శకత, వాక్‌ స్వేచ్ఛ నినాదాలతో ఈ ఫౌండేషన్‌ నిధులను వెచ్చిస్తోంది. ప్రస్తుతం 70కి పైగా దేశాల్లో జార్జ్‌ సోరోస్‌ ‘ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్స్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

జార్జ్ సోరోస్ రాజకీయంగానూ ఆయన అభిప్రాయాలు పెను సంచలనాల‌కు దారితీస్తాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో బరాక్‌ ఒబామా, హిల్లరీ క్లింటన్‌, జో బైడెన్‌లకు సోరోస్ మద్దతు ప్రకటించారు. మ‌రోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌లకు ద్వేషిస్తుంటాడు. అలాగే ఆయ‌న ప్ర‌ధాని మోదీపై కూడా ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తుంటారు.

జనవరి 2023లో, US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీపై ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. దీని తరువాత, ఫిబ్రవరి 2023లో, సోరోస్, మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తూ, హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ అమ్మకాల గురించి మాట్లాడారు. ప్రధాని మోదీని అని ఆయన విమర్శించారు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..