
komuravelli : తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కొమురవెల్లి మల్లన్న ఆలయం (komuravelli Mallanna Temple ) ఒకటి. సిద్ధిపేట జిల్లా (Siddipet District) చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ని ఒక కొండపై వెలిసిన మల్లిఖార్జున స్వామి ఆలయ క్షేత్రం సిద్ధిపేట నుంచి సుమారు 24 కి.మీ. హైదరాబాద్ నుంచి సుమారు 90 కి.మీ. వరంగల్ నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రతీ సంవత్సరం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునేందుకు 25 లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా జాతర సమయంలో భక్తులు పోటెత్తుతారు. ఇక సాధారణ రోజుల్లో రోజుకు 5 నుంచి 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
ప్రస్తుతం ఈ ఆలయానికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కొమురవెల్లికి సుమారు 45 కి.మీ. దూరంలో జనగామ రైల్వే స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్ నుంచి కూడా లఖుడారం వంటి సమీప స్టేషన్లకు రైళ్లు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి స్థానిక బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా ఆలయానికి వెళ్తుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
𝐑𝐚𝐢𝐥 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐢𝐯𝐢𝐭𝐲 𝐓𝐨 𝐊𝐨𝐦𝐮𝐫𝐚𝐯𝐞𝐥𝐥𝐢 𝐌𝐚𝐥𝐥𝐚𝐧𝐧𝐚 𝐓𝐞𝐦𝐩𝐥𝐞 𝐒𝐨𝐨𝐧
𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐇𝐚𝐥𝐭 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧
𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: 𝟗𝟓% 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞𝐝
The new halt station at Komuravelli village in Siddipet Dist., Telangana is nearing… pic.twitter.com/H1gzQJIP2X
— G Kishan Reddy (@kishanreddybjp) August 14, 2025
కొమురవెల్లి గ్రామం (Komuravelli village )లో కొత్త హాల్ట్ స్టేషన్ పూర్తి దశలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) తాజాగా తెలిపారు. ఈ స్టేషన్ పూర్తైతే కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తులకు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి మార్గం సుగుమం అవుతుందని తెలిపారు. దీంతో పాటు స్థానిక కనెక్టివిటీని పెరుగుతుందని అన్నారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ కు సంబంధించిన ఫొటోలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.