Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ కలిసి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు.
కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. “జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసి పోటీ చేస్తుంది. మిత్రపక్షాలతో సీట్ల పంపకం చర్చల సందర్భంగా కాంగ్రెస్, జెఎంఎం 81 స్థానాలకు గాను 70 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించుకున్నాయి” అని కూటమి భాగస్వామ్య పక్షాలతో సమావేశమైన తర్వాత సోరెన్ చెప్పారు.
ఇదిలా ఉండగా శుక్రవారం జార్ఖండ్‌లో సీట్ల పంపకాలపై ఎన్‌డిఎ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇందులో భాగంగా AJSU పార్టీ 10 స్థానాల్లో, JD (U) రెండు స్థానాల్లో మరియు లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ వర్గం ఒక స్థానంలో పోటీ చేయనుంది. ఇక భారతీయ జనతా పార్టీ (BJP ) మిగిలిన 68 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. రాంచీలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి, జార్ఖండ్ కో-ఎన్నికల ఇన్‌చార్జి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. బీజేపీ వంటి వ్యక్తిగత పార్టీలుగా కాకుండా ఇక నుంచి ఎన్డీయేగా కలిసి పనిచేస్తామని చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.