Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్

Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్

Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వెనుకాడుతున్నారని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు . బీజేపీపై రాహుల్ గాంధీ ‘ధైర్య పోరాటం’ చేస్తున్నారనే వాదనలన్నింటినీ ఆయన కొట్టిపారేశారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గాంధీ ఆశ్రయం పొందుతున్నారని ఆయన ఆరోపించారు.

రాహుల్‌ గాంధీ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాను ఆజాద్ విమర్శించారు, వారిని రాజకీయ నాయకులు కాకుండా “spoon-fed kids” అని ప్రస్తావిస్తూ, ఇద్దరూ తమంతట తాముగా ఏమీ చేయలేదని అన్నారు.
“రాహుల్ గాంధీ బిజెపి పాలిత రాష్ట్రాలలో పోటీ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? గాంధీ బిజెపితో పోరాడుతున్నట్లు ఆపార్టీ నేత‌లు చెబుతున్నారు. కానీ ఆయ‌న చర్యలు భిన్నంగా ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి పారిపోయి మైనారిటీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఎందుకు ఆశ్రయం పొందుతున్నారు?” ఉదంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని సంగల్దాన్, ఉఖ్రాల్ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆజాద్ ప్రసంగించారు.

READ MORE  ADR Report | లోక్ స‌భ మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.. ఇంకా షాకింగ్ వివరాలు..

తన పార్టీ అభ్యర్థి GM సరూరికి మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆజాద్ ప్రచారం చేశారు. ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు “విముఖత చేస్తున్నార‌ని, మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న “సురక్షిత స్థానాలను కోరుకునే ధోరణి తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమర్శించారు. “వారు జీవితంలో వ్యక్తిగత త్యాగాలు చేయలేదు. ఇందిరా గాంధీ, షేక్ అబ్దుల్లా వంటి వ్యక్తుల నుండి సంక్రమించిన రాజకీయ వారసత్వాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు. ఇద్దరూ సొంతంగా ఏమీ చేయలేదు. ఆజాద్ విమ‌ర్శించారు.

READ MORE  జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ ఎలా తగిలింది..?

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *