Saturday, July 5Welcome to Vandebhaarath

World

#international, #worldwide, #instagram, #travel #world #photography #art #india #fashion #usa #hiphop #business Global #online #artist #imun #uk #like #follow #news #education #lifestyle #africa #model #canada #dance #london USA

Bangladesh Crisis | బంగ్లాదేశ్ లో ధ్వంస‌మైపోతున్న హిందూ ఆల‌యాలు..
World

Bangladesh Crisis | బంగ్లాదేశ్ లో ధ్వంస‌మైపోతున్న హిందూ ఆల‌యాలు..

Bangladesh Crisis | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌ మధ్య గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలను దుండ‌గులు ధ్వంసం చేశారు. ఖుల్నా డివిజన్‌లోని మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి అక్క‌డి నుంచి ప‌రారైన త‌ర్వాత‌ ఆందోళనలు మరింత‌ తీవ్రమయ్యాయి. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఇస్కాన్ ప్రతినిధి యుధిస్తిర్ గోవింద దాస్, ఇస్కాన్ దేవాలయాలలో ఒకదానిని ధ్వంసం చేసి, తగులబెట్టినట్లు తెలిపారు. “నాకు అందిన సమాచారం ప్రకారం, మెహర్‌పూర్‌లోని మా ఇస్కాన్ సెంటర్‌లలో ఒకటి (అద్దెకి తీసుకున్నది) జగన్నాథుడు, బలదేవ్, సుభద్రా దేవి దేవతల విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసి త‌గులబెట్టారు అని తెలిపారు. ఆ ఆల‌యంలో త‌ల‌దాచుకున్న ముగ్గురు భక్తులు ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు " అని గోవింద చెప్పారు.ప్ర‌ధాని హసీనా అధికారం నుంచి వైదొలిగినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో...
Cognizant | తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ
World

Cognizant | తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ

న్యూ జెర్సీ (అమెరికా) : ఐటి రంగంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి పొందిన కాగ్నిజెంట్ (Cognizant)కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్ర‌క‌టించింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు కల్పించేలా కొత్తగా మ‌రో సెంటర్ నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఐటీ నిపుణులు, నిరుద్యోగులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. 20 వేల మంది ఉద్యోగులు ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను నిర్మించ‌నున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. సోమ‌వారం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా కాగ్నిజెంట్ సంస్థ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య‌ ఒప్పందం కుదిరింది. ఈ క్ర‌మంలో హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రం ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పుటికే అనేక‌ కొత్త సంస్థలు, ఐటీ కంపెన...
Sheikh Hasina | ప్ర‌ధాని ప‌ద‌వికి షేక్ హ‌సీనా రాజీనామా.. భారత్ – బంగ్లా సరిహద్దులో హై అలర్ట్..
World

Sheikh Hasina | ప్ర‌ధాని ప‌ద‌వికి షేక్ హ‌సీనా రాజీనామా.. భారత్ – బంగ్లా సరిహద్దులో హై అలర్ట్..

Sheikh Hasina | రిజర్వేషన్ల కోటా విష‌యంలో అధికార పార్టీ శ్రేణులకు నిర‌స‌న కారుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న‌ ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్న వేళ‌ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. మ‌రికొన్ని నివేదిక‌ల ప్ర‌కారం.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వచ్చినట్టుగా BBC బంగ్లా పేర్కొంది. కాగా, షేక్ హసీనా ఢాకా నుంచి వెళ్లిపోవ‌డం, రాజీనామాపై ఇంకా అధికారిక ధృవీకరించ‌లేదు. ఈ మేరకు ప్రధానమంత్రి సీనియర్ సలహాదారు ఒకరు మీడియాకు సంకేతాలు ఇచ్చారు. తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌లో అడుగుపెట్టిన హసీనా! మరోవైపు ఢాకాలోని ప్ర‌ధాని అధికారి...
US Presidential Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా క‌మ‌లా హారిస్..
World

US Presidential Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా క‌మ‌లా హారిస్..

US Presidential Elections | వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (kamala harris) 2024 ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా ప్రెసిడెంట్ జో బిడెన్ వారసురాలిగా కొన‌సాగుతుంద‌ని టాప్ డెమొక్రాట్లు చెప్పారు. US మాజీ సెనేటర్, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ అయిన 59 ఏళ్ల హారిస్ నవంబర్ 5 జ‌ర‌గ‌బోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షురాలిగా ఎన్నికైన‌ మొదటి మహిళగా అవ‌త‌రించ‌నున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్, ఆసియా వ్యక్తిగా ఆమె నిలుస్తారు.భార‌తీయ మూలాలున్న‌ కమ‌లా హారిస్ ను రాబోయే ఎన్నికలకు డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బిడెన్ (Joe Biden) ఆదివారం ఆమోదించారు. 2020లో పార్టీ నామినీగా నా మొదటి నిర్ణయం కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం. ఈ రోజు నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం.. డెమోక్రాట్‌గా కమలాకు నామినీగా ఉండాలనుకుంటున్నాను అని బిడెన్ ఒక పోస్ట్‌లో తెలిపారు. రిపబ...
Hajj | హజ్ యాత్రలో 98 మంది భారతీయ యాత్రికుల మృతి
World

Hajj | హజ్ యాత్రలో 98 మంది భారతీయ యాత్రికుల మృతి

Mecca | ఈ ఏడాది హజ్ (Hajj ) యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్య కారణాల వల్ల ఎక్కువ మరణాలు సంభవించినట్లు పేర్కొంది."ప్రతి సంవత్సరం, చాలా మంది భారతీయ యాత్రికులు హజ్‌ను సందర్శిస్తారు. ఈ సంవత్సరం, ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయ యాత్రికులు హజ్ కోసం సౌదీని సందర్శించారు. కోర్ హజ్ కాలం జూలై 9 నుంచి 22 వరకు ఉంది. ఇప్పటివరకు 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గతేడాది మరణాల సంఖ్య 187గా నమోదైంది.సౌదీ అరేబియాలోని మక్కాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రలో 1,000 మంది యాత్రికులు (Hajj pilgrims ) మరణించారని AFP నివేదించింది. అరబ్ దౌత్యవేత్త ప్రకారం.. ఈజిప్టు నుంచి 658 మంది యాత్రికులు మరణించారు. వీరిలో 630 మంది నమోదు కాని యాత్రికులు ఉన్నారు. జోర్డాన్, ఇండోనేష...
G7 Summit | ‘నమస్తే’ అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..
World

G7 Summit | ‘నమస్తే’ అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

G7 Summit | ఇటలీ (Italy) లో జరుగుతున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)  శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) తో సమావేశమయ్యారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. G7లో US, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. సమ్మిట్‌కు ఔట్‌రీచ్ కంట్రీగా భారత్‌ను ఆహ్వానించారు. జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం అర్థరాత్రి ఇటలీలోని అపులియా చేరుకున్నారు. వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. అయితే ప్ర‌ధానులిద్ద‌రూ న‌మ‌స్తే అంటూ ప‌ల‌క‌రించున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.కాగా ఈరోజు తెల్లవారుజామున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో ప్ర‌ధాని న‌రేంద్...
Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..
World

Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..

Maitri Setu | భారత్ , బంగ్లాదేశ్‌లను కలిపే వంతెన మైత్రి సేతు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా మార్చి 2021లో మైత్రి సేతు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఫెని నదిపై 1.9 కి.మీ విస్తరించి ఉన్న ఈ వంతెన భారతదేశంలోని దక్షిణ త్రిపుర జిల్లాలో గ‌ల సబ్‌రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌ఘర్‌తో కలుపుతుంది.అయితే “మైత్రి సేతు నిర్మాణం ఇప్పటికే పూర్త‌యింది. ల్యాండ్ పోర్ట్ దాదాపు సిద్ధంగా ఉంది… వంతెన మీదుగా ప్రయాణీకుల రాక‌పోక‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల రాక‌పోక‌లు మొద‌లైన త‌ర్వాత సరకు రవాణాను కూడా ప్రవేశపెట్టడానికి మ‌రో రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది” అని త్రిపుర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టే ఇటీవ‌ల‌ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు.వంతెన ద్వారా సరుక...
Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..
World

Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..

Python | ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ భారీ కొండచిలువ ఏకంగా ఓ మ‌హిళ‌ను మింగేసింది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన‌ 45 ఏళ్ల ఫరీదా ఆదృశ్యం కాగా మూడు రోజులుగా ఆమె కోసం గాలించారు. దీంతో ఆమె భర్త,ఇరుగుపొరుగువారు చివ‌ర‌కు ఓ రెటిక్యులేటెడ్ కొండచిలువ పొట్ట లోప‌ల మ‌హిళ మృత‌దేహాన్ని (Woman Found Dead inside Python ) కనుగొన్నారు. ఆ కొండచిలువ 5 మీటర్లు (16 అడుగులు) పొడ‌వు ఉంది.గురువారం రాత్రి ఫ‌రీదా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం భ‌ర్త‌తోపాటు గ్రామస్థులు గాలించారు. ఒక చోట భారీ కొండచిలువ పెద్ద పొట్ట‌తో అటూఇటూ క‌దులుతూ క‌నిపించింది. దీంతో అనుమానం వ‌చ్చి దాని పొట్ట‌ను కోసి చూడ‌గా అంద‌రూ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. పాము పొట్ట‌లో ఫరీదా తల కనిపించింది. కొండచిలువ పొట్ట‌లో పూర్తిగా దుస్త...
What happened in Rafah | రఫాలో ఏం జరిగింది? ఇండియన్ సెలబ్రిటీల స్పందనపై విమర్శలు ఎందుకు వస్తున్నాయ్..
World

What happened in Rafah | రఫాలో ఏం జరిగింది? ఇండియన్ సెలబ్రిటీల స్పందనపై విమర్శలు ఎందుకు వస్తున్నాయ్..

What happened in Rafah | రఫా అనేది గాజా స్ట్రిప్ లోని దక్షిణ భాగం. ఇది ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ప్రస్తుతం గాజా నివాసితులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు రఫా ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈజిప్ట్ లోపల మానవతా సహాయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. పాల‌స్తీనియ‌న్లు శ‌ర‌ణార్థులుగా తీసుకునేందుకు ఈజిప్ట్ తిరస్కరించింది. పాలస్తీనియన్లను వారి దేశంలోకి ప్రవేశించడానికి అనుమ‌తి లేదు.ఇటీవల రఫాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు రఫా నుండి ఈజిప్ట్ వరకు విస్తరించి ఉన్న అనేక సొరంగాలను బహిర్గతం చేశాయి, హమాస్ ఉగ్రవాదులు ఎవరూ గమనించకుండా ఈజిప్టు భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతించారని ఆరోపించారు. ఆ సొరంగాల గురించి ఈజిప్ట్ ప్రభుత్వానికి తెలుసునని ఇజ్రాయెల్ ICJ విచారణలో పేర్కొంది.మే 26న (స్థానిక కాలమానం ప్రకారం) పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ప్రాంతంలో రాకెట్లను ప్రయోగి...
All eyes on Rafah | సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఆల్ ఐస్ ఆన్ రాఫా..
World

All eyes on Rafah | సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఆల్ ఐస్ ఆన్ రాఫా..

All eyes on Rafah | ఇజ్రాయెల్ దాడిలో 45 మంది పౌరులు మరణించిన తర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇపుడు అంద‌రి దృష్టి రఫాపై ఉంది. మే 26న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలోని రఫాలోని  టెంట్ క్యాంపులో  భారీ అగ్నిప్రమాదం సంభవించి 45 మంది మరణించారు. అయితే ఇజ్రాయెల్‌పై దాడులకు కార‌ణ‌మైన ఓ అధికారితో పాటు వెస్ట్ బ్యాంక్‌కు హమాస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను అంత‌మొందించేందుకు ఈ దాడి చేప‌ట్టిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇది ఒక విషాదకరమైన తప్పిదంగా ప్రకటించింది. రఫాపైనే అందరి దృష్టి.. ఆల్ ఐస్ ఆన్ రాఫా ' అనేది గాజా నగరంలో జరుగుతున్న మారణహోమాన్ని ప్ర‌తిబింబించే పదబంధం. ఇజ్రాయెల్ దాడులతో ప్రభావితమైన పాలస్తీనియన్లకు ప్రపంచవ్యాప్త మద్దతు లభించడంతో ఈ పదబంధం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. #AllEyesOnRafah అనే హ్యాష్‌ట్యాగ్‌తో పలువురు ప్రముఖులు మద్దతుగా సందేశాలను పంచుకున్నారు. ప్రియాంక...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..